- భాజా భజంత్రీల నడుమ మొదలైన పూజలు
- శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు
- ఆలయ ద్వాజారోహణం చేసిన దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య
- పూజల్లో పాల్గొన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ
- ఘనంగా మాతేశ్వరి ఘటం ఎదుర్కొలు
- ఈ నెల 28న, శాఖాంబరి పూజలు
- పూజల్లో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ స్వేతా మహంతి
ఆర్సీ న్యూస్, జూలై 24 (హైదరాబాద్): భాజా భజంత్రీల నడుమ మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం కలశ స్థాపనతో మొదలైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగాయి. అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలలో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మొదలైన ఈ పూజా కార్యక్రమాలు ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటి చైర్మన్ గాజుల అంజయ్య తగిన ఏర్పాట్లు చేశారు. పూజల సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలు…
- అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలతో మీరాలంమండిలో ఎక్కడ చూసినా ఆథ్యాత్మిక వాతావరణం కనిపించింది.
- పూజలను పురస్కరించుకుని దేవాలయంలో శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది.
- మీరాలంమండికి చెందిన స్థానిక మహిళా భక్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
- ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య ఆమెకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
- ఈ పూజా కార్యక్రమంలో ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- గతేడాది కరోనా ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం మీరాలంమండిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
- అమ్మవారి భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ మీరాలంమండి అమ్మవారికి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
- భాజా భజంత్రీల నడుమ పోతురాజుల న్రుత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
- ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణలతో పూజలు మొదలయ్యాయి.
- అనంతరం ఉదయం 6 గంటలకు అఖండ జ్యోతి, శత చంఢీ సంకల్పం, విఘ్నేశ్వర పూజ, అంకురారోపణం,సర్వతోభద్ర మండపం, కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.
- ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటి చైర్మన్ గాజుల అంజయ్య వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం చేశారు.
భాజా భజంత్రీల నడుమ మతేశ్వరి ఘటం ఎదుర్కోలు…
- సాయంత్రం 4 గంటల నుంచి మాతేశ్వరి ఘటం ఎదుర్కొలు కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగాయి.
- మీరాలంమండి దేవాలయంలో అమ్మవారి ఘటాన్ని తయారు చేసిన పోతురాజులు నిష్టగా పూజలు నిర్వహించిన అనంతరం కోట్ల అలీజా లోని కోట మైసమ్మ దేవాలయానికి తీసుకెళ్లారు.
- అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పోతురాజుల న్రుత్యాలు,భాజా భజంత్రీల నడుమ సామూహిక ఊరేగింపు నిర్వహించారు.
- ఈ ఘట స్థాపన ఊరేగింపు కోట్ల అలీజా నుంచి మీరాలంమండి వరకు కొనసాగింది.
- దారిపొడవునా స్థానికులు అమ్మవారి ఘటానికి సాక పోసి టెంకాయలు కొట్టారు.
- మీరాలంమండి చేరుకున్న అమ్మవారి ఘటం బస్తీలోని అన్నివీధులలో తిరిగి దేవాలయానికి చేరుకుంది.
- దేవాలయం వద్ద కళాకారులు భరత నాట్యం న్రుత్యం చేస్తూ ముందుకు సాగుతుండగా..గాజుల అంజయ్య పూలతో మాతేశ్వరి ఘటానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
- అనంతరం దేవాలయంలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది.
- అనంతరం సహస్ర నామ కుంకుమార్చన జరిగింది.
ఈ నెల 28న, అమ్మవారికి శాఖాంబరి పూజ..
- ఉత్సవాలలో భాగంగా ఈ నెల 28న, అమ్మవారికి శాఖాంబరి పూజలను నిర్వహించనున్నామని గాజుల అంజయ్య తెలిపారు.
- పూజలలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వేతా మహాంతి పాల్గొంటారన్నారు.
- అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతో శాఖాంబరి పూజలు జరుతుతాయన్నారు.
- నిజాం కాలం నుంచి మీరాలంమండి అమ్మవారు భక్తుల నుంచి పూజలు అందుకుంటోందన్నారు.
- ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుందన్నారు.
- ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుందన్నారు.
1 thought on “అంగరంగ వైభవంగా ప్రారంభమైన మీరాలంమండి బోనాలు..”