నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈ నెల 24 నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర..

 

  • టీఆర్ఎస్ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ..
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర..
  • చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి యాత్ర ప్రారంభం..
  • పాదయాత్ర పేరు ఖరారు చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్..
  • పాతబస్తీలో సందడి చేసిన బీజేపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు
  • ముందుగా భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 13 (హైదరాబాద్): బీజేపీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు శుక్రవారం పాతబస్తీలో సందడి చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాతబస్తీకి తరలి వచ్చారు. చార్మినార్ కట్టడం పరిసరాలు బీజేపీ,కాషాయం జెండాలతో కళకళలాడాయి. నాయకులు బీజేపీ కండువాలు ధరించి చార్మినార్ చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ శాసన సభ నాయకుడు, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో ఎలాంటి ప్రసంగం చేయ బోెతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపించింది. రాజా సింగ్ ప్రసంగం కోసం ఉత్కంఠతతో ఎదురు చూశారు.

బీజేపీ నాయకుల్లో కనిపించిన ఉత్సాహాం..

  • శుక్రవారం బీజేపీ నాయకులలో ఉత్సాహాం కనిపించింది.
  • ఇతర ప్రాంతాల నుంచి పాతబస్తీకి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు చేరుకోవడంతో శుక్రవారం ఉదయం పర్యాటకులతో పాటు నాయకుల సందడి కనిపించింది.
  • దాదాపు ఒక గంట పాటు నాయకులు పాతబస్తీలో గడిపారు.
  • ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • దాదాపు అర గంట సేపు పూజలు జరిగాయి. ఆలయ ట్రస్టీలు బీజేపీ నాయకులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరిం చారు.
  •  దక్షిణ మండలం పోలీసులు అవసరమైన మేరకు బందోబస్తు నిర్వహించగా.. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
  • తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..బండి సంజయ్ నగరం నుంచి హుజురాబాద్ నియోజక వర్గం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.
  •  చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.
  • ఇందులో భాగంగా బండి సంజయ్ నిర్వహించే పాదయాత్రకు పేరు ప్రకటించడంతో పాటు పోస్టర్ ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని బీజేపీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద వేదికను ఏర్పాటు చేసింది.

నియంత్రుత్వ.. ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ..పాదయాత్ర

  • బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
  •  పోస్టర్ ను ఆవిష్కరిం చిన అనంతరం ఆయన మాట్లాడుతూ..నియంత్రుత్వ.. ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. అవినీతి విముక్తి కోసం బండి సంజయ్ ఈ పాదయాత్రను నిర్వహించనున్నారన్నారు.
  • దీనికి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశలో నగరం నుంచి ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ వరకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టానుసారంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
  • ఉప ఎన్నికను పురస్కరించుకుని కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
  • దళిత బందు పథకం లాంటి జిమ్ముక్కుల పథకాలను ప్రజలు విస్మరించరన్నారు.
  •  కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఇలాంటి పథకాల ఆలోచన సీఎం కేసీఆర్ కు వస్తుందన్నారు.
  • ఎన్ని వందల,వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినా..హుజూరాబాద్ నియోజక వర్గంలో తమ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
  • ఉప ఎన్నిక కోసమే పథకాలంటూ లబ్డి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
  • ఎన్ని జిమ్మిక్కులు చేసినా హుజురాబాద్ నియోజక వర్గంలో తమ పార్టీ విజయం ఖాయమన్నారు.
  • ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బాబుమోహన్, స్వామి గౌడ్, బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అద్యక్షులు భాషా, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ ప్యారసాని వెంకటేష్, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు పాండు యాదవ్, ప్రధాన కార్యదర్శి టి.ఉమామహేంద్ర,బీజేపీ కార్పొరేటర్లు దర్శన్, లాల్ సింగ్, భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు చిరంజీవి,రూప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.