- ఆగస్టు 1న, పాతబస్తీతో పాటు నగరంలో బోనాల సమర్పణ..
- 2న,పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు
- నగరంలో 8 వేల మంది పోలీసులతో కొనసాగనున్న బందోబస్తు..
- నగర పోలీసు కమిషనర్ నుంచి హోం గార్డు ఆఫీసర్ల వరకు..
- లాల్ దర్వాజలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పూజలు
- పాతబస్తీలో ఊరేగింపు సందర్బంగా ట్రాఫిక్ దారి మళ్లింపు..
- బోనాలకు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్న ఉత్సవాల నిర్వాహకులు
ఆర్సీ న్యూస్, జూలై 31 (హైదరాబాద్): నగరంలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సంసృతి, సంప్రదాలకు అనుగుణంగా నగరంలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 8 వేల మంది పోలీసు అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ..ఇప్పటికే గొల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలతో పాటు నార్త్ జోన్ లోని సికింద్రబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాల సమర్పణ అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ఇక ఆదివారం ఉదయం పాతబస్తీతో పాటు నగరంలోని 5 జోన్ల లో బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయన్నారు. ఇందుకోసం భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు జరిగాయన్నారు. ఆగస్టు 1న, పాతబస్తీతో పాటు నగరంలో బోనాల సమర్పణ, 2న,పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ఉంటుందన్నారు. నగర పోలీసు కమిషనర్ నుంచి హోం గార్డు ఆఫీసర్ల వరకు బోనాల బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఆదివారం లాల్ దర్వాజలో ఉదయం 8 గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయన్నారు. సోమవారం పాతబస్తీలో నిర్వహించే ఊరేగింపు సందర్బంగా ట్రాఫిక్ దారి మళ్లింపు ఉంటుందన్నారు. ఆదివారం జరుగబోయే బోనాలకు సంబందిత ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. ఆదివారం జరిగే పాతబస్తీ బోనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బోనాల సమర్పణ మరుసటి రోజైన సోమవారం పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా పాతబస్తీలో జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజును పరిగణిస్తోంది. ఇలా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఇచ్చే సెలవు పాతబస్తీలో జరిగే జాతర రోజు కావడంతో పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉత్సవాల నిర్వాహకులు కళాకారులు,శకటాలను ఏర్పాటు చేయనున్నారు. పాతబస్తీలో గతేడాది కరోనా వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యారు. అలాగే ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25న పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది. ఆగస్టు 2న కళాకారుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో సామూహిక ఊరేగింపు కొనసాగనుంది.
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకున సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించారు. బోనాల సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూనే అమ్మవారికి ఆదివారం బోనాల సమర్పణ పూజా కార్యక్రమాలను పూర్తి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..