- మీరాలంమండి పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వేతా మహాంతి
- అన్నిరకాల కూరగాయలు,ఆకుకూరలతో ప్రత్యేక అలంకరణ
- దేవాలయంతోె పాటు ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి అలంకరణ
- హాజరైన పలువురు ప్రముఖులు
- ఉప్పుగూడ మహంకాళి శాఖాంబరి పూజలో పాల్గొన్న స్వామి గౌడ్..
- అక్కన్నమాదన్న దేవాలయంలో శాఖాంబరి పూజల్లో పాల్గొన్న సూర్యనారాయణ మూర్తి
- 1న, అమ్మవారికి బోనాల సమర్పణ..2న ఘటాల ఊరేగింపు
ఆర్సీ న్యూస్, జూలై 28 (హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం పాతబస్తీలోని అమ్మవారి దేవాలయాలలో శాఖాంబరి అలంకరణ పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. అన్ని రకాల కూరగాయలు,ఆకు కూరలతో అమ్మవారి దేవాలయంతో పాటు ఆలయంలో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. వందలు..వేల కిలోల కూరగాయలతో ఈ శాఖాంబరి అలంకరణ చేయడం పాతబస్తీలో ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుదవారం పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిణి మహాంకాళి దేవాలయం, ఉప్పూగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మహాంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం, మేకలబండలోని నల్లపోచమ్మ దేవాలయం, మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలలో శాఖాంబరి అలంకరణ పూజలు కన్నుల పండువగా జరిగాయి. అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయంలో జరిగిన శాఖాంబరి పూజల్లో ఆథ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి, ఉప్పుగూడ మహాంకాళి పూజలలో తెలంగాణ కౌన్సిల్ మాజీ చైర్మన్ కనక మామిడి స్వామిగౌడ్, మీరాలంమండి శ్రీ మహాంకా ళేశ్వర దేవాలయంలో జరిగిన శాఖాంబరి పూజల్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వేతా మహాంతి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు నాగ్ నాథ్ మాశెట్టి దంపతులు, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు తదితరుు పాల్గొన్నారు. ఆలయ కమిటి చైర్మన్ గాజుల అంజయ్య వీరికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. జిల్లా కలెక్టర్ స్వేతా మహంతికి పూర్ణ కుంభంతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయంలోకి ఆహ్వానించారు. భాజా భజంత్రీల నడుమ కళాకారులు భరత నాట్యం చేస్తూ జిల్లా కలెక్టర్ కు సాదరంగా స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రదక్షణ నిర్వహించిన స్వేతా మహంతి అమ్మవారికి కాయకూరలు, ఆకుకూరలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పంచహారతి పూజలో పాల్గొన్న అనంతరం ఆమెతో పాటు నాగ్ నాథ్ మాశెట్టి దంపతులను వేద పండితులతో ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. జిల్లా కలెక్టర్ మొదటిసారి పాతబస్తీ లోని అమ్మవారి దేవాలయంలో పూజలకు రావడంతో స్థానిక భక్తులలో ఎంతో ఆసక్తి కలిగింది. జిల్లా కలెక్టర్ పూజలకు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న స్థానిక భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారి దేవాలయానికి చేరుకుని స్వాగతం పలికారు. కొంత మంది భక్తులు కలెక్టర్ తో సెల్పీలు దిగారు. దేవాలయంలో జరిగిన పూజల అనంతరం సన్మానించడానికి ఆలయ కమిటి చైర్మన్ గాజుల అంజయ్య కుర్చీలు వేసి కూర్చోమని కోరగా…అందుకు ఆమె నిరాకరించారు. నిలిచే ఉంటానని తేల్చి చెప్పడంతో..కొద్దిసేపు మాత్రమేనంటూ రెక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ.. కలెక్టర్ ఒప్పు కోలేదు. దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి గర్బగుడి ముందు అమ్మవారి విగ్రహానికి ఎదురుగా కూర్చోవడం మంచిది కాదని చెప్పారు. దీంతో చిన్నపాటి పీటలను వేఃయడంతో అంగీకరించిన ఆమె పీటపై కూర్చోవడంతో వేద పండితులు ఆశీర్వదించారు. అమ్మవారి పట్ల జిల్లా కలెక్టర్ కు ఉన్న భక్తి భావానికి మీరాలమండి భక్తులు హర్షం వ్యక్తం చేశారు. నిష్టగా ఆమే శాఖాంబరి పూజలలో పాల్గొనడం పట్ల మీరాలంమండి భక్తులు మనసారా స్వాగతించి గౌరవించారు. ఈ శాఖాంబరి పూజలలో ఆమె ఉత్సాహాంగా పాల్గొ న్నారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..