ఆర్సీ న్యూస్(హైదరాబాద్): కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోందని..కరోనాను కట్టడి చేయడం కోసం తగిన ముందు జాగ్రత్తలు ఎంతో అవసరమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కరోనా కారణంగా మరోసారి లాక్ డౌన్ వద్దనుకుంటే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రేటర్ లో ఆయన సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. రూ.99 లక్షలతో మూసాపేట్ సర్కిల్ లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు నిర్మించతలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం, రూ. 3.50 కోట్లతో కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్ లో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించారు.
రూ.66.59 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద నిర్మించిన ఆర్.యు.బి ని ప్రారంభించారు. అలాగే రూ.40 లక్షలతో నిర్మించిన బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి , గ్రేటర్ మేయర్ జి.విజయలక్ష్మీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…కరోనా పూర్తిగా పోలేదన్నారు. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడం తో పాటు సమాజంలోని ఇతరులను కూడా కాపాడుకోవడం కోసం కరోనా నిబంధనలను పాటించాలన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అయ్యిందని..ఈసారి అలాంటి పరిస్థితులు పునరావ్పతం కాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో వరదలతో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటారన్నారు. గతంలో రూ.3 వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించి స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఈసారి రూ.3500 కోట్లతో సీవరేజ్, డ్రైనేజీ ఆధునీకరణ పనులను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు,ఎమ్మెల్సీ నవీన్ రావు, డిఫ్యూటీ మేయర్ ఎం.శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్,
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..