- ఈనెల 29 వరకు భారీ వర్షాలు
- అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలంటున్న అధికారులు
- మూడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- ఉస్మాన్ సాగర్ 4 గేట్లు ఎత్తి 480 క్యూసెక్ల నీటి విడుదల
- ఎట్టకేలకు రజనీకాంత్ మ్రుతదేహాం లభ్యం
ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 27(హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గులాబ్ తుఫాన్ కారణంగా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో 3 జిల్లాలో హైలెట్ ప్రకటించింది. సోమవారం, మంగళవారం, బుధవారం వరకూ జోరుగా వర్షాలు కురుస్తాయని.. దీంతో జిల్లాల కలెక్టర్లు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నే బయటికి వెళ్లాలని కోరుతున్నారు. ఈనెల 27, 28,29 తేదీలలో తుఫాను కారణంగా భారీ, అతి భారీ వర్షాలు ఉన్నాయని.. ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం లో ఎమర్జెన్సీ సెల్ అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైనా ఏవైనా వరద సమస్యలతో పాటు ప్రమాదకర పరిస్థితులు తలెత్తిత్తే వెంటనే ఎమర్జెన్సీ సెల్ సంప్రదించి తగిన సహాయం పొందాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రజలను కోరారు. రాబోయే రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా వరద తాకిడి ఎక్కువవడంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను ఒక అడుగు మేరకు 480 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలో వదిలారు. ఆదివారం రాజేంద్రనగర్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని గోల్డెన్ టెంపుల్ వద్ద నాలో ప్రమాదవశాత్తు పడిపోయినా రజినీకాంత్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నం పూర్ చెరువు వద్ద రజినీకాంత్ మృతదేహాన్ని కనుగొన్నారు.
ఎల్లుండి వరకు భారీ వర్షాలు: కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్..
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ అప్రమత్తం చేశారు.
సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..