నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

100 డయల్ చేస్తే…5 నిమిషాల్లో పోలీసులు హాజరు…

100 డయల్ చేస్తే...5 నిమిషాల్లో పోలీసులు హాజరు…

 

  • దేశంలోనే నెంబర్ వన్ గా మన పోలీసు వ్యవస్థ..
  • ఫిర్యాదు అందిన వెంటనే బాధితుల వద్దకు పోలీసులు
  • లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త పీఎస్ భవనాల నిర్మాణం
  • లాక్ డౌన్ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలి..
  • రూ.4.16 కోట్లతో కొత్తగా నిర్మించిన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..
  • ప్రారంభోత్సవం సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని..100 డయల్ చేస్తే..5 నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు సందర్భంగా రాష్ట్రంలో రౌండ్ ది క్లాక్ సేవలందిస్తున్న రాష్ట్ర పోలీసులు ఎంతో అభినందనీయులని ఆయన పోలీసుల సేవలను కొనియాడారు. పోలీసులు చక్కగా పని చేస్తున్నందుకు రాష్ట్రంలో క్రైం రేట్ పడి పోయిందన్నారు. ఎక్కడైనా పోలీసుల అవసరం ఉందని హండ్రెడ్ కు డయల్ చేస్తే..ఐదు నిమిషాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్న పోలీసులు ఆయా బాధితుల సమస్యలు తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. రూ.4.16 కోట్ల నిధులతో హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ భవనాన్ని నూతనంగా నిర్మించారు. దీనిని శనివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి,నగర సీపీ అంజనీకుమార్, నగర అదనపు పోలీసు కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు.

తమ పోలీసు వ్యవస్థ దేశంలో నెంబర్ వన్…

  •  ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసులు బాధ్యత అని మంత్రి అన్నారు.
  •  దేశంలో తమ పోలీసు వ్యవస్థ నెంబర్ వన్ అని ఆయన కితాబిచ్చారు.
  •  డిజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ఎప్పటికప్పడు స్పందిస్తూ క్రైం రేట్ తగ్గిస్తున్నారన్నారు. 
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పోలీసు వ్యవస్థ మరింత పటిష్టంగా తయారైందన్నారు. 
  • ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీసు విభాగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఎప్పటికప్పడు రివ్యూలు చేస్తూ అవసరమైన నిధులను కేటాయిస్తున్నారన్నారు.
  •  విధినిర్వహణలో పోలీసులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 
  • ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త భవనాలను నిర్మించి అందుబాటులోకి తెచ్చిన ఘనత మన సీఎంకు దక్కుతుందన్నారు. 

లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త భవనాల నిర్మాణం…

  • కొత్తగా నిర్మిస్తున్న అన్ని పోలీసు స్టేషన్ లలో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అన్నారు. 
  • లాక్ డౌన్ అమలు తీరును తాను ఎప్పటికప్పడు పరిశీలిస్తున్నామని.. రాష్ట్ర పోలీసులు ఆయా ప్రాంతాలలోని ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తు అందరి మన్ననలు పొందుతున్నారన్నారు.
  •  కరోనా వైరస్ బారి నుంచి మనందరినీ కాపాడడం కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా రౌండ్ ది క్లాక్ సేవలు కొనసాగిస్తున్నారన్నారు.
  •  మన ప్రాణాలను కాపాడటం కోసం డ్యూటీలో ఉన్న పోలీసులతో ప్రజలంతా సహకరించాలన్నారు.
  •  లాక్ డౌన్ అమలు జరుగుతున్న సమయంలో ఎవరూ రోడ్ల మీదకు రావద్దన్నారు.
  •  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మహమూద్ అలీ ప్రజలను కోరారు. 

లాక్ డౌన్ అమలును ప్రతి ఒక్కరూ పాటించాలి…

  • లాక్ డౌన్ అమలు ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మంత్రి మహమూద్ అలీ కోరారు. 
  • కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించాలంటే ప్రజలంతా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పాటించాలన్నారు. 
  • అనవసరంగా రోడ్ల మీదకు వస్తే..కేసులు తప్పవన్నారు. 
  • రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి ఉంటున్నారని.. మతసామరస్యానికి నగరం ప్రతీకగా నిలుస్తుందన్నారు. 
  • నేరాలకు పాల్పడే వారి పట్ల మన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు.
  •  అవసరమైతే వారిపై పీడీ ఆక్ట్ పెడుతున్నారన్నారు.
  •  ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసులు బాధ్యత అన్నారు.
  •  దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఒకసారి పరిశీలిస్తే..మన రాష్ట్రంలో లాక్ డౌన్ ఎంతో పటిష్టంగా ఉందన్నారు.
  •  పోలీసు పెట్రోలింగ్ ఎంతో చక్కగా ఉందన్నారు.
  •  ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసుల సేవలు భేష్  అన్నారు.