నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..

charminar Returning Officer
  • ఈనెల మూడు నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ..
  • ఆదివారమైన ఈనెల 5న నామినేషన్ల స్వీకరణ ఉండదు..
  • జనరల్ అభ్యర్థులకు రూ.10 వేల రుసుము..
  • ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు..

ఆర్సీ న్యూస్, హైదరాబాద్ (అక్టోబర్ 2): తెలంగాణ శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 3వ, తేదీ నుండి ప్రారంభం కానున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాసన సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈనెల 3వ తేదీ నుండి 10 తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మధ్యలో వచ్చే ఒక ఆదివారం(ఈ నెల 5న ) సెలవు దినంగా ఉంటుంది. అభ్యర్థి వెంట నలుగురు మాత్రమే కార్యాలయంలోకి నామినేషన్ వేసేందుకు రావాలి. నామినేషన్ కార్యాలయం నుండి 100 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, కేవలం అభ్యర్థికి సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతావారు 100 మీటర్లకు దూరంగా ఉండాలి.
అభ్యర్థికి ప్రతిపాదించేవారు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఓటరై ఉండాలి. అభ్యర్థి దేశంలో ఎక్కడైనా ఓటరై ఉండాలి. నామినేషన్ ఫీజు రూ. 10,000 అని, ఎస్సీ ఎస్టీలకు మాత్రం రూ.5000 రూపాయలు కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. నామినేషన్ గడువుకు 48 గంటల ముందు జాతీయ బ్యాంకుల్లో అభ్యర్థి ఖాతా తెరవాలని సూచించారు. తన కుటుంబ సభ్యుల పేరిట లేదా ఎలక్షన్ ఏజెంట్ పేరిట జాయింట్ అకౌంట్ ఉండవచ్చును. నామినేషన్లు వేసేటప్పుడు ర్యాలీలు ప్రదర్శనలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ సెట్ లు వేయవచ్చు. అదే విధంగా రెండు అసెంబ్లీ స్థానాలలో కూడా పోటీ చేయవచ్చని, ఆ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. అభ్యర్థులు ఏ ఫారం బీఫారం అందజేయాలి. అభ్యర్థులు పై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఏదైనా కోర్టులో శిక్షలు పడితే వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయాలి. అదేవిధంగా రుణాలు వాటికి సంబంధించిన వివరాలను కూడా అందజేయాలి. ఈనెల 13న స్క్రూట్ని ఉంటుంది. 15 న ఉపసంహారణ ఉంటుంది. పోలింగ్ కేంద్రాలలో వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను చిత్రీకరించనున్నారు.
నామినేషన్ తో పాటు జత పర్చవలిసిన పత్రములు మరియు సూచనలు

  • నామినేషన్ ఫారం -2 B. (అన్ని కాలములు పూర్తిగా నింప వలెను )
  • రూ.10/- నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన నోటరీ అఫిడవిట్ ఫారం – 26 ( అన్ని కాలంబు పూర్తిగా నింపవలెను).
  • 2 స్టాంపు సైజు ఫోటోలు (2×2.5 సెంటి మీటర్లు).
  • డిపాజిట్ పైకం రూపాయిలు 10,000/- జనరల్ కేటగిరి రూపాయిలు 5,000/- ఎస్సి ఎస్టీ, కేటగిరి ( కుల దృవీకరణ పత్రం తో సహా )
  • పోటీ చేసే అభ్యర్థి వేరే నియోజక వర్గం నకు చెందిన ఓటరునట్లయితే సంబంధిత ఈ ఆర్వో నుండి ఓటరు ధృవీకరణ పత్రం
  • నామినేషన్ వేసే రోజుకు ఒక రోజు ముందుగా జాతీయం చేయబడిన బ్యాంకు నందు తెరిచిన బ్యాంకు అకౌంట్ వివరములు మరియు మొదటి పేజి జిరాక్స్ కాపీ సమర్పించ వలెను.
  • జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక ప్రతిపాదిత ఓటరు.
  • ప్రతిపాదిత ఓటరు ఖచ్చితంగా ఈ నియోజక వర్గం నకు సంబందించిన ఓటరు అయి ఉండవలెను.
  • గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థులు మరియు స్వతంత్రులు గా పోటీ చేసి అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదిత ఓటర్లుండాలి.
  • ఫారం-26 నందలి ఐటెం 8 వర్తించు అభ్యర్థి అయితే ప్రభుత్వ బకాయిలు లేనట్లు సంబంధిత అధికారి చేత జారి చేయబడిన దృవీకరణ పత్రం.
  • గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర పార్టీ అభ్యర్థి అయినట్లయితే ఫారం – ఏ మరియు ఫారం బీ లు సమర్పించాలి.