నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వాక్సిన్ పట్ల పుకార్లను నమ్మ వద్దు…టీకా మాత్రమే మనల్ని కాపాడుతుంది.

వాక్సిన్ పట్ల పుకార్లను నమ్మ వద్దు…టీకా మాత్రమే మనల్ని కాపాడుతుంది.

 

  • మన్ కీ బాత్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ
  • ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి
  • మనతో పాటు సమాజంలోని వారందరిని కాపాడగలుగుతాం.
  • ఇప్పటికే దేశంలో 31 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు
  • టీకాల ప్రాధాన్యతపై స్థానిక యువకులు అవగాహన కల్పించాలి

ఆర్సీ న్యూస్,జూన్ 27 (హైదరాబాద్): వాక్సినేషన్ పై పుకార్లను నమ్మొద్దని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. కొంత మంది పనిగట్టుకుని పుకార్లను పుట్టిస్తున్నారని.. టీకా తీసుకుంటే ఏదో అనర్దం జరిగిపోతుందని భయపెడుతున్నారని.. ఇది సరైంది కాదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం సందర్బంగా దేశ ప్రజలను ద్దేశించి మోడీ మాట్లాడారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో టీవీలను ఏర్పాటు చేసుకుని దేశ ప్రజలు మన్ కీ బాత్ కర్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ నాయకులు గ్రామాలలో టీవీలను ఏర్పాటు చేసి గ్రామస్థులందరిని ఒక చోట కూర్చోబెట్టి కార్యక్రమాన్ని చూపించారు. ఈ సందర్బంగా దేశ ప్రధాని మాట్లాడుతు…వాక్సినేషన్ జో్రుగా కొనసాగుతోందని..ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని.. కేవలం వాక్సిన్ మాత్రమే తమను కాపాడుతుందని దేశ ప్రజలను కోరారు. కొన్ని గ్రామాలలోని ప్రజలు వాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారని..వీరికి స్థానికంగా చదువుకున్న యువకులు అవగాహన కల్పించాలని కోరారు. టీకా తీసుకున్నప్పుడే తమను తాము కాపాడుకోవడమే కాకండా సమాజంలోని ఇతరులను కూడా మనం కాపాడడానికి వీలు పడుతుందనే విషయాన్ని మోదీ దేశ ప్రజలకు సూచించారు. తన మన్ కీ బాత్ కార్యక్రమం సందర్బంగా మద్యప్రదేశ్ లోని ఒక గ్రమంతో పాటు కాశ్మీర్ లోని మరో గ్రామంలోని ఇద్దరితో మోడీ మాట్లాడుతూ..వాక్సిన్ తీసుకున్నారా..అని ప్రశ్నించారు. దీనికి వారు ఇంకా తీసుకో లేదని సమాధానం ఇవ్వడంతో మోడీ వారిరువురికి టీకా వేసుకోవడం పట్ల కలిగే లాభాలను వివరించారు. చనిపోతారని వారు చెప్పిన దానికి బదులిస్తూ..ఉత్తుత్తి పుకర్లను నమ్మ వద్దన్నారు. దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ మాత్రమే తొలగిందని..కరోనా మహమ్మారి ఇంకా ఉందని తెలిపారు. దీనికి ఆయా గ్రామాలలోని వారు అంగీకరిస్తూ వెంటనే టీకాలు తీసుకుంటామని దేశ ప్రధానికి మాట ఇచ్చారు. అంతేకాకుండా తాము తీసుకోవడమే కాకుండా మా గ్రామంలోని వారందరికి టీకాలను ఇప్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలన్నారు. టీకా ఒక్కటే తమను కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడ కలుగుతుందన్నారు. లేనిపోని భయాలతో కొంత మంది ఇంకా టీకాలు తీసుకోవడం లేదన్నారు. ఇలాంటి వారికి స్థానిక యువకులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జ్వరం వస్తుందని..చనిపోతున్నారని చెప్పె వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు దేశంలో 31 కోట్ల మందికి తీకాలను పంపిణీ చేశామన్నారు. ఇందులో ఎక్కడ ఎవరికి అనారోగ్య సమస్యలు తలెత్త లేదన్నారు. ఏడాది క్రితం వాక్సిన్ ఎప్పడు వస్తుందో..ఎలా పంపిణీ జరుగుతుందో..మా వరకు వస్తుందా లేదా..అని అనుకున్న వారందరికి ప్రస్తుతం టీకాలు అందాయన్నారు.ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో టీకా పంపిణి కోనసాగుతుందన్నారు.

దేశ వ్యాప్తంగా టీకాల పంపిణీని బాధ్యతను కేంద్రమే తీసుకుందన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతున్నాయన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు టీకాల పంపిణీ ఎంతో అవసర ముందన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయ న్నారు. ఆధునిక ప్రపంచం ఇలాంటి విపత్తును చూడలేదన్నారు.  సెకండ్ వేవ్ కరోనా వైరస్ ను తాము ధీటుగా ఎదుర్కొంటు న్నామన్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తూ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మనం కరోనా వైరస్ ను పారదోలగలుగుతున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని.. అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగటిపూట లాక్ డౌన్ ను తొలగిస్తున్నాయన్నారు. పగటిపూట లాక్ డౌన్ తొలగిస్తున్నా రంటే…కరోనా వైరస్ పూర్తిగా లేదన్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. మాస్కలు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలన్నీ లాక్ డౌన్ తొలగించినప్పటికీ.. తీసుకోవాలన్నారు.