నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

2న, ఫలితాలు గెలుపెవరిదో..ఓటమెవరికో..

2న, ఫలితాలు గెలుపెవరిదో..ఓటమెవరికో..

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): దేశంలో ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం( మే-2) జరుగనుంది. ఈ ఓట్ల లెక్కింపులో గెలువెవరిదో..ఓటమెవరికో..అని దేశ ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేఫత్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించింది. ఎంతో కీలకంగా మారిన ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపుకు ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగాయి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ..ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఇప్పటికే దేశ ప్రధాన ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఓట్ల కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని.. నెగెటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ లో పాల్గొనాలని సీఈసీ తేల్చి చెప్పింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వాహణపై దేశ వ్యాప్తంగా ఎన్నో విమర్షలు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలేంటని ప్రశ్నించారు. దేశంలో సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తుండగా..ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సభలు,సమావేశాలకు స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు గుంపులు,గుంపులుగా హాజరయ్యారు. కొంత మంది మాస్క్ లు ధరించగా..మరికొంత మంది మాస్క్ లు ధరించకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభలు, సమావేశాల సందర్బంగా  నాయకులు,కార్యకర్తలు ఎక్కడా భౌతిక దూరం ఏమాత్రం పాటించ లేదు. దీంతో పలు ప్రాంతాల్లో కరోనా భయంతో స్థానికులు బెంబెలెత్తారు. ఏదిఏమైనా ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగాయి. తమిళ్ నాడు, పశ్చిమ బెంగాల్,అసోం,పుదుచ్చేరి,కేరళ తదితర ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ఫ్రారంభమై..ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల కోసం దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఫలితాలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్…

తమిళ్ నాడు, పశ్చిమ బెంగాల్,అసోం,పుదుచ్చేరి,కేరళ తదితర ఐదు రాష్ట్రాల ఫలితాలపై పలు జాతీయ స్తాయి న్యూస్ ఛానల్స్ లలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆయా న్యూస్ ఛానల్స్ నిర్వహించిన సర్వేలలో కొంత మంది ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమ విశ్లేషణలు వినిపించారు. తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయని ప్రకటించుకున్నాయి. ఐదు రాష్ట్రాలలో తమిళ నాడు,కేరళ,పుదుచ్చేరి దకిన భారత దేశంలో ఉండగా..అసోం,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పశ్చిమంగా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించాలని ఆశ పడుతోంది. వాస్తవానికి ఈ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ…గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లను సాధించింది. ఇదే ఆశతో ఆయా రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలు సైతం అధిక సంఖ్యలో వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీగా జరిగిన శాసన సభ ఎన్నికలలలో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రేస్ కి చెందిన మమతా బెనర్జీ తిరిగి విజయం సాధిస్తారని కొన్ని న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్ లో స్పష్టం చేశాయి. 2011,2016 శాసన సభ ఎన్నికలలో వరుసగా రెండు పర్యాయాలు టీఎంసీ అధికారం చేపట్టిందని..ఈ ఎన్నికలలో తిరిగి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని చెబుతున్నాయి. కాగా..2019 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 18 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బలం పెరిగిందని..ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని మరికొన్ని న్యూస్ ఛానల్స్ తేల్చి చెప్పాయి. కేరళలో రెండోసారి కూడా అధికార ఎల్డీఎఫ్ విజయం సాధిస్తుందంటున్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయం సాధించవచ్చు అంటున్నారు. అస్సాంలో బీజేపీ..తమిళనాడులో ఎం.కే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే( డ్రావిడ మున్నెత్ర కజగం) విజయం వరించనున్నట్లు తెలిపాయి.