నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జయహో నీరజ్… జయహో భారత్…

జయహో నీరజ్... జయహో భారత్…
  • ఓలంపిక్-2020 గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా..
  • వందేళ్ల తర్వాత దేశానికి గోల్డ్ మెడల్
  • నీరజ్ చోప్రాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ
  • రూ.6 కోట్ల నజరానా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం

ఆర్సీ న్యూస్,ఆగస్టు 7 (హైదరాబాద్): జపాన్లోని టోక్యో లో జరుగుతున్న ఓలంపిక్-2020 గేమ్స్ లో హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించారు. వందేళ్ల తర్వాత దేశానికి నీరజ్ చోప్రా ద్వారా గోల్డ్ మెడల్ లభించింది. దీంతో యావత్ దేశ ప్రజలు నీరజ్ చోప్రా కు జేజేలు పలుకుతున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నీరజ్ ఫోన్లో మాట్లాడుతూ.. అభినందనలు తెలిపారు. నీరజ్ ఓలంపిక్స్ గేమ్స్ లో  పాల్గొనడానికి వెళ్లేటప్పుడు ప్రధాని ఆయనతో మాట్లాడుతూ.. నేను అప్పుడు నీతో మాట్లాడినప్పుడు నీలో ఎంతో ఉత్సాహం కనిపించింది. నీవు ఎలాంటి ప్రెషర్ లేకుండా ఎంతో ధైర్యంతో టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ వెళ్తున్నట్లు అప్పుడే అనిపించింది. నీవు ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల దేశ ప్రజలు నీకు రుణపడి ఉన్నారు. ఎంతో కష్టపడి గోల్డ్ మెడల్ సాధించావు. నీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను..అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా నీరజ్ చోప్రా కు అభినందనలు తెలియజేశారు. నీరజ్ హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి అంటే ఎంతో ఇష్టం. 2018 లో ఇండియన్ ఆర్మీకి  నాయబ్ సుబేదార్ గా ఎంపికయ్యారు. క్రీడల పట్ల చిన్నప్పటినుంచి ఎంతో ఆసక్తి కనబరిచే నీరజ్ 2018 కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ఏసియన్ గేమ్స్ లలో మెన్స్ జావెలిన్ త్రో లో విజయం సాధించారు. ప్రస్తుతం శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 87.58 మీటర్ల వరకు విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. 25 దేశాలకు చెందిన 35 మంది క్రీడాకారులు మెన్స్ జావలిన్ త్రో లో పాల్గొనగా…నీరజ్ 87.58 మీటర్ల దూరం వరకు విసిరి విజయం సాధించారు. 2018లో చైనా లోని బీజింగ్ లో జరిగిన ఓలంపిక్స్ గేమ్ లో షూటర్ విభాగంలో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా… ప్రస్తుతం నీరజ్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్ లో గోల్డ్ మెడల్ సాధించారు. మెన్స్ జావలిన్ త్రో లో నీరజ్ చోప్రా విజయం సాధించి గోల్డ్ మెడల్ సంపాదించడంతో… అక్కడి హర్యానా ప్రభుత్వం ఆయనకు ఆరు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. 2012లో లండన్ లో జరిగిన ఓలంపిక్స్ గేమ్ లో దేశానికి 6 మెడల్స్ లభించగా… ప్రస్తుతం టోక్యో ఓలంపిక్స్-2020 లో ఇప్పటి వరకు ఒక గోల్డ్ మెడల్, రెండు సిల్వర్ మెడల్ లతో పాటు నాలుగు కాంస్య పతకాలు లభించాయి. ఈ విధంగా దేశానికి ఇప్పటి వరకు అన్ని విభాగాలలో 7 మెడల్స్ లభించాయి. గేమ్స్ లో గోల్డ్, సిల్వర్, కాంస్య పథకాలను సాధించిన క్రీడాకారులు అందరికీ దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. జయహో నీరజ్… జయహో భారత్… అంటూ గొంతెత్తి అభినందిస్తున్నారు.