- పార్టీ సభ్యత్వానికి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన..
- ఆత్మగౌరవం, బాధ్యతలు లేని పదవులు అనవరం..
- ప్రగతి భవన్ కాదది..బానిసలకు నిలయం..
- 19 ఏళ్లు పార్టీ కోసం పని చేశా..
- ఉద్యమకారులను విస్మరించిన సీఎం
- ప్రస్తుతం మంత్రివర్గంలో ఏ ఉద్యమకారులున్నారో చెప్పాలి..
- సీఎం కేసీఆర్ దయతో ఇన్నేళ్లు రాజకీయ జీవితం గడిపావ్: మంత్రి గంగుల
ఆర్సీ న్యూస్( హైదరాబాద్): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ ఫార్టీ అధిష్టానానికి తన రాజీనామాతో బదులిచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎట్టకేలకు తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మట్లాడుతూ…ఆత్మ గౌరవం లేని చోట పని చేయడం అనవసరమని ఆయన ప్రకటించారు. స్పీకర్ కు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్వయంగా అందజేస్తానని..స్పీకర్ అందుబాటులో లేకపోతే తన రాజీనామా పత్రాన్ని లేఖ ద్వారా పంపిస్తానన్నరు. ఆత్మ గౌరవం, బాధ్యత లేని మంత్రి పదవి వద్దని చెప్పానన్నారు. 19 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ అనుబంధానికి, సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ పటిష్టానికి నిరంతరం క్రుషి చేస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలలో ప్రేమాభిమానాలు సంపాదించుకున్న తనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ అభియోగాలు మోపారన్నారు. ఎవరో అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు పై ఆగమేఘాల మీద స్పంధించడం..తన వివరణ తీసుకోకుండానే కేసులు నమోదు చేయడం..మంత్రి వర్గం నుంచి తప్పించడం..వంటి దుందుడుకు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఒకవైళ తనపై ఫిర్యాదులు వస్తే…తనను పిలిచి అడగాల్సిందన్నారు. ముందే పథకం ప్రకారం తనపై నిందనలు మోపీ భూ కబ్జాలకు పాల్పడ్డాడని బజారుకీడ్చడం ఎంత వరకు సమంజసమన్నారు. నా వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ఱయం తీసుకుని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. తనకు రాజీనామా చేయడం కొత్త కాదని..గతంలో 17 మంది రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేస్తే..కేవలం 7 మందిమి మాత్రమే గెలిచామన్నారు. పార్టీ నుంచి ఎన్నిసార్లు భి-ఫామ్ ఇచ్చినా గెలిచానన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ డబ్బు,అణచివేతలను నమ్ముకున్నాడన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే..రాజీనామా చేసి ప్రజల్లొకి వెళ్లామన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను అసెంబ్లీలో అవహేళన చేస్తూ..పట్టుమని పది సీట్లు గెలవ లేదని విమర్శలు చేసినా ధీటుగా ఎదుర్కొన్నానన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కరీంనగర్ ప్రజలు ఉద్యమకారులను గెలిపించారన్నారు. అప్పడు కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుంటే..ఇప్పటు అధర్మాన్ని నమ్ముకున్నారన్నారు. కుట్రలు,కుతంత్రాలతో్ తాత్కాలిక విజయం సాధించ వచ్చు కానీ, అవి ఎల్లకాలం చెల్లవన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పని చేసిన ఉద్యమకారులను పక్కన పెట్టారన్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఏ ఉద్యమకారుల ఉన్నారో చెప్పాలన్నారు. ప్రగతి భవన్ లోకి మంత్రులకు అనుమతి లేనప్పుడు తాను మంత్రినని.. ఎందుకు అనుమతించరని ప్రశ్నించిన మాట వాస్తవమన్నారు. అది ప్రగతి భవన్ కాదని..బానిసల నిలయమని ఆయన ఆరోపించారు. తనను బొంద పెట్టమని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని..నాకన్నా ఎక్కువ మంత్రి హరీష్ రావు అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంఓ) ఎస్సీ,ఎస్టీ,బీసీ అధికారి ఒక్కరైనా ఉన్నారా..? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మంత్రులకు ఎక్కడా గౌరవం లేదన్నారు. ఆర్దిక శాఖ మంత్రి లేకుండానే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు జరుగుతాయి..ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి గంగులతో పాటు నాయకులు తీవ్రస్థాయిలో జవాబిచ్చారు. సీఎం కేసీఆర్ దయతో ఇన్నేళ్లు రాజకీయ జీవితం గడిపిన ఈటల తన గత మేమిటో తెలుసుకోవాలన్నారు. మంత్రిగా కొనసాగుతూ అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన ఈటల రాజేందర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకునే వ్యక్తిత్వం సీఎం కేసీఆర్ కు లేదన్నారు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..