నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్…

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్…
  • ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా….
  • కేంద్ర మంత్రులు,సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరిన ఈటెల
  • ఈటెలతో పాటు బీజేపీలో చేరిన మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులు
  • దక్షిణంలో పార్టీ బలోపేతానికి క్రుషి
  • 2023 టార్గెట్..తెలంగాణ రాష్ట్రం.
  • టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు..మంత్రులకు గౌరవం లేదు: ఈటెల

ఆర్సీ న్యూస్, జూన్ 14 (హైదరాబాద్): ఎట్టకేలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం బీజేపీలో చేరారు. సోమవారం హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున తన అనుచరులు,మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యేలతో కలిసి న్యూ ఢిల్లీ చేరిన ఈటెల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్,ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలతో పాటు మరికొంత మంది సీనియర్ నాయకులతో బీజేపీలో చేరారు.ఇప్పటికే ఈనెల 12న, ఈటెల తన శాసన  సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే రోజు ఆయన మాట్లాడుతూ..ఈ నెల 14న బీజేపీ నేత జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ముందుగా చెప్పినట్లే ఆయన సోమవారం పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ..దక్షిణాది రాష్ట్రాలలో బీజేపి బలోపేతానికి తాము ద్రుష్టి సారిస్తున్నామన్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉండని..రాబోయే 2023 టార్గెట్ గా ముందుకెళతామన్నారు. తప్పనిసరిగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని..తాామే అధికారంలోకి వస్తామన్నారు.

ఈటల ఏమన్నారంటే…

  • నా ఆస్తుల మీద..నీ ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో గానీ..సీబీఐతో గానీ విచారణ చేయించే దమ్ము నీకుందా..అంటూ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
  •  వందల,వేల మంది ఉద్యమ కారులు ఎక్కడున్నారో తెలుసా నీకు..ఇంట్లోడు బయటోడయ్యిండు..బయటోడు ఇంట్లోడయ్యిండు..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
  •  ప్రగతి భవన్లోకి తనతో పాటు మరికొంత మంది మంత్రులను అనుమతించని రోజే తాను వెంటనే స్పందించానని…గులాబి జెండాకు మేము కూడా ఓనర్లమే అని ధైర్యంగా చెప్పిన ఈటెల రాజేందర్ దేనికి భయపడేది లేదన్నారు.
  • కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నవారు డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. అటువంటి వారికి ప్రజలు బుద్దిచెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు.
  • త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులు బీజేపీలో చేరనున్నారన్నారు.
  • రాబోయే ఉప ఎన్నికలలో ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పనున్నారన్నారు.
  •  అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనలేరన్నారు.
  •  తనకు పలువురు ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్నారు. వీరంతా రాబోయే రోజుల్లో బీజేపీలో చేరనున్నారన్నారు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులేమన్నరంటే…

  • మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి జగదీష్ రెడ్డితో పాటు సైదిరెడ్డి తదితరులతో పాటు పలువురు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
  •  మునిగే పడవలో ఈటెల పయనిస్తున్నారన్నారు.
  • మంత్రిగా కొనసాగుతూ అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం పేరుతో డ్రామాలాడుతున్నరని విమర్శించారు.
  • మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకోవద్దా..అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
  • స్వంత పార్టీ నాయకులైనా తప్పు చేస్తే… చూస్తూ ఊరుకునే వ్యక్తిత్వం సీఎం కేసీఆర్ కు లేదన్నారు.

ఏప్రిల్ 30న మొదలైన ఈటెల ఎపిసోడ్..జూన్ 14న బీజేపీలో చేరడం వరకు వెళ్లింది..…

  • ఏప్రిల్ 30న మొదలైన ఈటెల ఎపిసోడ్..బీజేపీలో చేరడం వరకు వెళ్లింది.
  • ఈటెల రాజేందర్ భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
  •  అంచెలంచెలుగా ఈటెల భూ కబ్జాలపై విచారణ చేయించింది.
  • దాదాపు వెయ్యి కోట్ల రూపాలయలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది.
  • ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఏప్రిల్ 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించారు.
  • ఈటెల భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణ చేయించారు.
  • విచారణలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని… సంబంధిత అధికారులు ప్రాథమికంగా నిర్ధేశించి తమ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందజేయడంతో.. వెంటనే స్పందించిన సీఎం మే 1న, ఈటెల రాజేందర్ వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తప్పించారు.
  •  ఆ వెంటనే విచారణకు సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందడంతోె .. మే 2న, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారు.
  • వీటన్నింటిపై మే 3న ఉదయం ఈటెల రాజేందర్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా..దేవర యంజాల్ సీతారామస్వామి దేవాలయ భూముల ఆక్రమణ అంశం వెలుగు చూసింది.
  • దీంతో ఈటెల భూ కబ్జాల వ్యవహరం ఎపిసోడ్ నాలుగవ రోజుకు చేరింది.
  •  మొదటి రోజైన ఏప్రిల్ 30న..అచ్చంపేటలోని జమున హ్యాచరీస్ అసైన్డ్ ల్యాండ్ భూ వివాదంపై మీడియాలో హల్ చల్..
  • మే 1న, వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఆయనను తొలగించడం..
  • మే 2న, ఆ వెంటనే మళ్లీ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.
  • ఇక మే 3న, కొత్తగా దేవరయంజాల్ దేవాలయం భూమి ఆక్రమణలు తెరపైకి వచ్చాయి.
  • ఇలా ఈటెల రాజేందర్ భూ వివాదం రాజకీయ మలుపులు తిరిగి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాతో పాటు ఈ నెల 12న, తన శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి..14న బీజేపీలో చేరారు.