నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రంజాన్ మాసం షురూ..మక్కా మసీదు లోకి విజిటర్స్ నాట్ అలౌడ్..

మక్కా మసీదులోకి విజిటర్స నాట్ అలౌడ్..

రంజాన్ మాసం షురూ..మక్కా మసీదులోకి విజిటర్స నాట్ అలౌడ్..

ఆర్సీ న్యూస్ ( హైదరాబాాద్): రంజాన్ మాసం షురూ అయ్యింది. మంగళవారం రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. మక్కా మసీదులో మంగళవారం రాత్రి ఇషాకీ నమాజ్ నిర్వహించిన అనంతరం తరావీ జరిగింది. మక్కా మసీదు కతీబ్ రిజ్వాన్ ఖురేషీ ఆధ్వర్యంలో తరావీ సందర్బంగా ఖురాన్ పఠనం జరిగింది. బుధవారం తెల్లవారు జామున 4.37 గంటలకు సహార్ తో మొదటి రోజు ఉపవాస దీక్షలు ప్రారంభమవుతుండగా..సాయంత్రం 6.37 గంటలకు ఇఫ్తార్ విందు ఉంటుంది. నెల రోజుల పాటు రోజంతా ఐదు సార్లు నమాజు చేసే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఉపవాసాలు వదులుతారు. ప్రతి రోజు సహార్, ఇఫ్తార్ వేళలు మారుతుంటాయి. రంజాన్ మాసం సందర్బంగా నిర్వహించే ఉపవాస దీక్షల అనంతరం చేసే ఇఫ్తార్ విందులో నెల రోజుల పాటు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం 1000 కిలోల ఖర్జూరంలను మంజూరు చేసింది. అంతేకాకుండా ప్రతిరోజు ఉచితంగా పంపిణీ చేయడానికి రోజుకు 100 డజన్ల అరటి పండ్లను కూడా ముస్లింలకు మసీదులో అందజేయనుంది. ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. దీంతో రంజాన్ మార్కెట్లు అన్నీ వినియోగదారులతో కళకళలాడుతున్నాయి.

మక్కా మసీదులో పలు అభివ్రుద్ది పనులు..

రూ.2 కోట్ల నిధులతో మక్కా మసీదులో పలు అభివ్రుద్ది పనులు.. 

  • రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన మక్కా మసీదును రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు.
  •  కళ్లు మిరుమిట్లు గొలిపే దీప కాంతుల్లో మక్కా మసీదు మెరిసిపోతోంది. 
  • దాదాపు రూ.2 కోట్ల నిధులతో పలు అభివ్రుద్ది పనులను చేపట్టారు. 
  • ఇందులో రూ.99.95 లక్షలతో 44 మరుగుదొడ్లు, 39 మూత్రశాలలు కొత్తగా నిర్మించారు. 
  • ఇందులో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా నిర్మించారు. మిగిలిన నిధులతో లైటింగ్, ఇతర ఎలక్ట్రికల్ పనులను చేపట్టారు.
  •  వేసవి కాలం కావడంతో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడం కోసం
  • మసీదు ప్రాంగణంలో కొత్తగా షెడ్ ఏర్పాటు చేశారు. 

 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా…

  • కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్దనలకు హాజరయ్యే ముస్లింలకు ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్తలను సూచించింది.
  •  మక్కా మసీదు లోకి విజిటర్స్ ను అనుమతించడం లేదు.
  •  మక్కా మసీదు పర్యాటక ప్రదేశం కావడంతో ప్రతి రోజు పర్యాటకులు మక్కా మసీదును అధిక సంఖ్యలో సందర్శిస్తుం టారు. 
  • అయితే కారోనా కారణంగా పర్యాటకులను లోనికి అనుమతించడం లేదు. 
  • ఈ  మేరకు విజిటర్స్ నాట్ అలోవ్డ్..అంటూ ప్రధాన ద్వారం వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు.
  •  అయితే ఈ నిబంధనలు కేవలం విజిటర్స్ కు మాత్రమేనని మక్కా మసీదు సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్డుల్ ఖదీర్ సిద్దిఖీ తెలిపారు.
  •  రోజుకు ఐదు సార్లు జరిగే నమాజ్ తో పాటు తరావీ, ఇఫ్తార్ విందులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. 
  • భౌతిక దూరం పాటిస్తూ..మాస్క్ లు ధరించాలన్నారు. సామూహిక ప్రార్దనలకు హాజరయ్యే ముస్లింలు తమ వెంట జానిమాజ్లను తెచ్చుకోవాలన్నారు. 
  • ఇళ్ల వద్దే వజూ చేసుకుని రావాలని ఆయన సూచించారు.
  •  60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులు సామూహిక ప్రార్దనల్లో పాల్గొనడానికి రాకపోవడమే మంచిదని ఆయన సూచించారు. 
  • ఈ మేరకు ఈ ఆంక్షలను తెలియజేసే బోర్డులను మక్కా మసీదులో బ్యానర్ల ద్వారా ప్రదర్శిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు