నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వాక్సినేషన్ (టీకా)ఉత్సవాలు జరుపుకుందాం: పీఎం నరేంద్ర మోడీ 

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): మహానీయుల జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వాక్సినేషన్ (టీకా)ఉత్సవాలను నిర్వహిస్తే ఆశించిన ఫలితాలుంటాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. గురువారం రాత్రి పలు రాష్ట్రాల సీఎంలతో పీఎం నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు,ఆదేశాలు జారీ చేశారు.  కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా దేశాన్ని కాపాడడం కోసం 45 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే టీకా పండుగను జరుపుకోవడానికి సిద్ధం కావాలని నరేంద్ర మోడీ కోరారు. 

  • ఈనెల 11న, మహాత్మా జ్యోతిభా ఫూలే జయంతి వేడుకలు, 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్గర్ బి.ఆర్.అంబెద్కర్ జయంతిలను పురస్కరించుకుని ఈ వాక్సినేషన్ పండుగను నిర్వహిద్దామన్నారు. 
  • ఇందు కోసం అన్ని రాఫ్ట్రాల ముఖ్యమంత్రలు తగిన చర్యలు తీసుకుంటే బావుంటుందన్నారు. 
  • దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని..అంతే వేగంగా దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు.
  •  కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ..దేశంలో మరోసారి లాక్ డౌన్ ఉండదన్నారు.
  •  కొంత మంది కరోనా టీకాలను తీసుకోవడానికి వెనకడుగు వేయడం సరైంది కాదన్నారు. అయినప్పటికీ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతుందన్నారు.
  • ఒక్కరోజులో 40 లక్షల మందికి వాక్సినేషన్ జరిగిందన్నారు. 
  • అర్హులైన వారందరికి టీకా ఇప్పించే సామాజిక కర్తవ్యాన్ని యువత ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నారు. 
  • యువత తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదన్నారు. టీకా తీసుకునే విధంగా యువత శ్రమించాలన్నారు. 
  • టీకాలపై విరివిగా యువత ప్రచారం నిర్వహించాలన్నారు.
  •  సీనియర్ సిటిజన్లతో పాటు 45 ఏళ్ల వయస్సున్న వారందరికి టీకాలపై కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. 
  • పుకార్లను నమ్మకుండా చేయాలని..టీకా తీసుకునేంత వరకు యువత కష్టపడాలన్నారు.
  •  టీకాలు తీసుకునే విధంగా ఎన్ సీ సీ,ఎన్ ఎస్ ఎస్ విభాగాలు పని చేయాలన్నారు. 
  • దేశంలోని అన్ని రాష్ట్రాల  గవర్నర్లు, ముఖ్యమంత్రులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఆయా రాష్ట్రాల్లోని సెలబ్రిటీలతో పాటు అధికార,అనధికార ప్రముఖులతో కలిసి వాక్సినేషన్ పై ప్రచారం నిర్వహించాలన్నారు. 
  • కళాకారులు,క్రీడాకారులతో వెబ్ నార్ నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ ఫీక్ స్టేజ్ కు చేరిందని..అంత మాత్రానా ప్రజలను భయాందోళనకు గురిచేయకుండా తగిన ముందు జాగ్తత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
  • ఒక వైపు వాక్సినేషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతుండగా..వైరస్ వ్యాప్తి కూడా అంతకన్న వేగంగా ఉందన్నారు. ఇందుకు కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమేనన్నారు. 
  • కరోనా కట్టడికి అవసరమైన ముందు జాగ్రత్తలు ఎంతో అవసరమన్నారు.
  •  ఒక కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే..వెంటనే అతను పరీక్షలు చేయించుకోవాలని..చాలా వరకు లక్షణాలు లేకుండా ఉంటుండడంతో పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు
  •  దీంతో ఇతరులకు వైరస్ సోకుతుందన్నారు. కుటుంబంలో  ఒకరికి పాజిటివ్ వచ్చిన వెంటనే అందరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
  • పాజిటివ్ వచ్చిన వారు వెంటనే హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. 
  • దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షల రేటును పెంచాలన్నారు. 
  • ఆర్టీపీసీఆర్ పరీక్షల సందర్బంగా పేషంట్ల గొంతులోపల నుంచి శాంపిల్స్ తీసుకోవాలని..నామమాత్రంగా శాంపిల్స్ సేకరిస్తే..రిజల్ట్స్ తప్పుగా వస్తాయన్నారు. 
  • చిన్నచిన్న కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై ద్రుష్టి సారించాలన్నారు. ఆయా మైక్రో కంటైన్మెంట్ జోన్లలోని అన్ని కుటుంబాలలోని వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. 
  • కరోనా టీకా తీసుకున్నాక కూడా కరోనా వైరస్ కట్టడి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 
  • మాస్క్ లతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు.