నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో పకడ్బందీ గా లాక్ డౌన్ అమలు..

రాష్ట్రంలో పకడ్బందీ గా లాక్ డౌన్ అమలు..

చార్మినార్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): పకడ్బందీ గా లాక్ డౌన్ అమలు జరుగుతోంది. ఎక్కడ లాక్ డౌన్ ఆంక్షల ఉల్లంఘన జరగడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా వైరస్ మోగిస్తున్న డేంజర్ బెల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా వైరస్ బారి నుంచి తమను తాము కాపాడుకోవడం తో పాటు సమాజంలో ఇతరుల ప్రాణాలను సైతం కాపాడడం కోసం ఇళ్లల్లోనే ఉంటున్నారు. గతేడాది మొదలైన కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సందర్భంగా ప్రజలు ఆంక్షలను లెక్క చేయకుండా రాకపోకలు సాగించారు. గతేడాదితో పోల్చితే..ఈసారి తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.్

  • ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గతేడాది వాహనాలు స్వాధీనం తో పాటు కేసులు అధికంగా నమోదయ్యాయి.
  • ఈసారి పాతబస్తీలో గతంతో పోల్చితే లాక్ డౌన్ ఆంక్షల ఉల్లంఘన తక్కువే.
  • కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ అధికం అవుతుండడంతో  హైకోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో రోజుకు  20 గంటల పాటు లాక్ డౌన్ అమలు చేస్తోంది.
  • రంజాన్ పండుగ మూడు రోజుల ముందుగానే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు లోకి వచ్చినప్పటికీ..రంజాన్ పండుగ తో పాటు మరుసటి రోజు కూడా లాక్ డౌన్ ఆంక్షలు ఎక్కడ బేఖాతరు కాలేదు.
  • హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తో పాటు రాచకొండ,సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ల పరిధిలో లాక్ డౌన్ అమలు భేషుగ్గా జరుగుతోంది.
  • రంజాన్ పండుగ రోజు కూడా ముస్లింలు సామూహిక ప్రార్థనలు తమ తమ ఇళ్లలోనే నిర్వహించి లాక్ డౌన్ పాటించారు.
  • అత్యవసర, నిత్యావసర పనులకు వెళ్లే వారు తప్ప..రోడ్లపై అనవసరంగా రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
  • ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద విధినిర్వహణలో పోలీసులు వాహనదారులతో ఫ్రెండ్లీ గా వ్యవహరిస్తున్నారు.
  • తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన పత్రాలతో పాటు ఈ-పాస్ లు చూపిస్తే..వాటిని పరిశీలించి వదిలేస్తున్నారు.
  • ఒకవేళ సరైన అనుమతి పత్రాలతో పాటు ఆధారాలు చూపించక పోతే అక్కడే కౌన్సిలింగ్ నిర్వహించి రూ. 1000 జరిమానా విధిస్తున్నారు తప్ప..ఎక్కడా లాఠీలను ఝుళిపించడం లేదు.
  • లాక్ డౌన్ నుంచే కాకుండా లాక్ డౌన్ ముందు అమలులో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూ సందర్భంగా కూడా డ్యూటీ లో పోలీసులు లాఠీలకు పని చెప్పలేదు.
  •  దీంతో పోలీసులు విధి నిర్వహణ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

లాక్ డౌన్ అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు…

  • రాష్ట్రంలో గతంలో అమలు జరిగిన రాత్రిపూట కర్ఫ్యూ తో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగుతోందని హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
  • లాక్ డౌన్ అమలులో పోలీసుల పనితీరు భేష్ అని ప్రశంసించింది.
  •  విధి నిర్వహణలో పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
  •  ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పని చేయాలని సూచించింది.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరు, కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సోమవారం జరిపింది.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్,రాచకొండ,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లు హైకోర్టు విచారణకు హాజరయ్యారు.
  • కరోనా,లాక్ డౌన్ నిబంధనల అమలుపై డీజీపీ కోర్టుకు నివేదిక అందజేశారు.
  • కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా డ్రగ్ మాఫియా ను కట్టడి చేయడానికి పలువురు నిందితులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన విషయం హైకోర్టుకు తెలిపారు.
  •  లైఫ్ సేవ్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి పలు చర్యలు తీసుకున్నామని..ఇందులో భాగంగా 98 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
  • కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించని 22,560 మందిపై కేసులు నమోదు చేశారు.
  •  మాస్కులు లేని వారికి 3,39,412 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు తెలిపారు.
  •  నిబంధనలు బేఖాతరు చేసిన వారి వద్ద నుంచి రూ. 31 కోట్లు జరిమానా విధించినట్లు నివేదికలో తెలిపారు.
  • రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 26,082 కేసులు నమోదు చేశారు.
  • హైకోర్టు సూచన మేరకు కరోనా ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  •  మొత్తం మీద రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరు, కరోనా కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి పోలీసులను అభినందించింది.
  •  ఈ సేవలు ఇక ముందు కూడా కొనసాగించాలని హైకోర్టు పోలీసులకు మరికొన్ని సూచనలు చేసింది.