సెప్టెంబర్ 16, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు…

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు...
  • రాపిడో ప్రకటన లో నటించిన నటుడు పై టి ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆగ్రహం..
  • ఆర్టీసీ ని తక్కువ చేసి ప్రకటనలు ఇస్తే సహించేదంటున్న సజ్జనార్..

 ఆర్సీ న్యూస్, నవంబర్ 09(హైదరాబాద్): టి ఎస్ ఆర్ టి సి కి వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేసే ప్రైవేట్ సంస్థలతో పాటు అందులో నటించే నటీనటులకు సైతం లీగల్ నోటీసులు అందజేయడానికి టిఎస్ ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా రక్షణతో కూడిన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందజేస్తున్న ఆర్టీసీ ని తక్కువ చేసి దుష్ప్రచారం చేయడం సరైంది కాదని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతున్న ప్రకటన పట్ల టిఎస్ ఆర్టిసి ఎండి సీరియస్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీసినందుకు రాపిడో తరపున టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ ద్వారా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి లీగల్ నోటీసు పంపడానికి రంగం సిద్ధమైంది.టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై సీరియస్ అయ్యారు. రాపిడో ప్రకటన పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూ ట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ప్రకటనలో..ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని..రాపిడో చాలా వేగంతో పాటు సురక్షితంగా ఉంటుందని..అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.  ఈ ప్రకటన ఆర్టీసీ ప్రయాణికులు, ఆరాధకులతో పాటు ఆర్టీసీ స్వంత, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక మందికి తీవ్ర మనస్థాపం కలిగిస్తోందని సంస్థ బావిస్తోంది. ర్యాపిడో సర్వీస్‌తో పోలిస్తే ఆర్టీసీ బస్సుపై ప్రతికూల వైఖరిని సజ్జనార్ ఖండిస్తున్నారు. ఆర్టీసీని కించపరచడం…యాజమాన్యం  ప్రయాణికులు, అభిమానులు, ఉద్యోగులు సహించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి నటీ నటులు మెరుగైన, పర్యావరణ, పరిశుభ్రమైన సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో నటించాలి తప్పా..ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా పని చేయరాదన్నారు.

టిఎస్‌ఆర్‌టిసి సామాన్యుల సేవలో ఉందని..అది నటునితో పాటు ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థ తెలుసుకోవాలన్నారు. వీరికి లీగల్ నోటీసు పంపుతుందని ఎండి తెలిపారు.  ఇప్పటికే బస్సులు, బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపైనా..బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇంకా, ప్రజా రవాణా, ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీ నటులు, సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులందరినీ ఆయన అభ్యర్థించారు.