areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రోజుకు మిలియన్ టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది: కేటీఆర్

రోజుకు మిలియన్ టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది: కేటీఆర్
  • 45 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో టీకాలు వేయగలం
  • ఇక్కడ టీకాలు ఉత్పత్తి అవుతున్నా..మనకు సప్లై లేదు
  • నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్..ఐనా టీకాలు అందుబాటులో లేవు
  • కేంధ్ర ప్రభుత్వం వెంటనే సరిపడ టీకాలను సరఫరా చేయాలి

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు మిలియన్ టీకాలు వేయడం.. 45 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో టీకాలు వేయగల సామర్థ్యం ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నగరంలోని మాధాపూర్ లో 6 బెడెడ్ బ్రిడ్జి ఐసీయూ ఫెసిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఆశ్రే తో కూడిన పూర్తిస్థాయి 150 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ఐటీ,పరిశ్రమలు, వాణిజ్య. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్,ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం ప్రారంభించారు. ఈ రోజు ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రిని ప్రస్తుతం 150 పడకలకు విస్తరించడం జరిగింది. మే 3న, 100 పడకల ఆసుపత్రిని ఫ్రారంభించగా..ప్రస్తుతం మరో 50 పడకలను పెంచి తిరిగి రోగులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఐసీయులో 6 వెంటిలేటర్ల ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే 160 మందికి పైగా రోెగులు విజయవంతంగా చికిత్స పొందారని సంబంధిత అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డ్, ఆరోగ్య భద్రత ఉన్నవారికి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ఇక్కడ నైపుణ్యత కలిగిన వైద్య బ్రుందం వైద్య సేవలను అందజేస్తుంది. 20 మంది వైద్యులు, 50 మందికి పైగా నర్సులు రౌండ్ ది క్లాక్ సేవలను అందిస్తున్నారు. మితమైన రోగులకు తేలికపాటి సహయం, ఎక్కువ పేద,క్లిష్టమైన రోగులకు అత్యవసరంగా పడకలను ఆదా చేయడం కోసం ఆసుపత్రులకు సహాయం చేస్తుందని సంబందిత అధికారులు తెలిపారు. ప్రారంభ కోవిడ్ రోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే రోగులు 08045811138 కు కాల్ చేసి మరిన్ని వివరాలతో పాటు ఇతర అవసరమైన సమాచారాన్ని పొందవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఆశ్రేను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సహా యాంకర్ చేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీకా డ్రైవ్ ను ఎలా పెంచాలో ఇప్పడు తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఒక కోటి వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంధ్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిందన్నారు. రాష్ట్రాలకు సరిపడ టీకాలను అందజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. టీకాలను అందజేయడానికి తమ వద్ద సామర్ద్యం ఉందన్నారు. రాష్ట్రానికి సరిపడ టీకాలను వెంటనే అందజేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ అని ఆయన అన్నారు. నగరం వ్యాక్సిన్ల తయారీ కేంధ్రంగా ఉన్నప్పటికీ..స్వంత రాష్ట్రానికి టీకా సరఫరా జరకపోవడం దురద్రుష్టకరమన్నారు. ఇక్కడ టీకాలు ఉత్సత్తి అవుతున్నప్పటికీ..వాటిపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఇది సరైంది కాదన్నారు. టీకా తయారవుతున్న రాష్ట్రంలో..ఆ రాష్ట్ర అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కేంధ్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తయారీదారుల నుంచి నేరుగా టీకాలు వేయడానికి తమకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వాాన్ని కోరమన్నారు. దేశంలో పంజాబ్ తో పాటు ఇంకా ఏడు రాష్ట్రాలు కూడా మనలాగే కేంధ్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. అయితే భారత ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదన్నారు. వ్యాక్సిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని..సరఫరా తక్కువగా ఉందన్నారు. యుఎస్ఏ, డెన్మార్క్,కెనెడా, ఇతర దేశాలలో టీకాలు ఉపయోగించకుండా నిమ్మకున్నాయని..మరోవైపు టీకాల అవసరం మనకు ఎంతో ఉందని ఆయన అన్నారు. ప్రజలను కోవిడ్ నుంచి కాపాడడానికి వాక్సినేషన్ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్నారు.