నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆరోగ్యంగా కేసీఆర్..ఐసోలేషన్లో కేటీఆర్

ఐసోలేషన్లో కేటీఆర్ కరోనా వైరస్ పాజిటివ్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యం కుదుట పడుతోంది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని..ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని సీఎం కేసీఆర్ వ్యక్తి గత వైద్యులు డాక్టర్ ఎం.వీ.రావు తెలిపారు.ఒకవైపు సీఎం కేసీఆర్ కోలుకుంటుండగా..మరోవైపు ఆయన కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో వెంటనే కేటీఆర్ కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవగా పాజిటివ్ అని తేలడంతో స్వీయ నియంత్రణ లోకి వెళ్లారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్లో ఉన్నానని..తనతో దగ్గరగా మెలిగిన వారు కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకోవాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

https://twitter.com/KTRTRS/status/1385439391972089859

తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికీ..రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లు నిరంతరం కృషి చేస్తున్నారు. కరోనా కట్టడితో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది…

కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని చెబుతున్నారు.  99.5 శాతం మంది కరోనా సోకి నప్పటికీ వైద్య సేవలు పొంది నయమయ్యారన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమానం ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తోంది. కేవలం 0.5 శాతం మందికే కరోనా వైరస్ లక్షణాలున్నాయని..వీరు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పడకలు ఖాళీగా ఉన్నాయని. పీపీఈ కిట్లు,మందులు,అంబులెన్స్ లు సరిపడా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్పటికీ.. కరోనా లాక్ డౌన్, బంద్ లుండవని ప్రభుత్వం  స్పష్టం చేసింది. గతంలో కరోనా కర్ఫ్యూ విధించడంతో రాష్ట్ర ప్రజలు పలు ఇబ్బందులకు గురైన విషయం అందరికి తెలిసిందేనని… అందుకే ఈసారి లాక్ డౌన్ పెట్టడం లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. కరోనా కట్టడిలో తమ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని..దీని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని కేసులు పెరిగినా…అందరికి వైద్య సేవలు అందించడానికి తమ వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెబుతోంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో శుభకార్యాలకు తగిన జాగ్రత్తలు తీసుకుని అతి తక్కువ మందితో ముగించాలని…రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా  ఉండడమే మంచిదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.