నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

యువతకు టీకాలు ఇస్తాం..ఇప్పడే కాదు: మంత్రి ఈటల

యువతకు టీకాలు ఇస్తాం. మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): మే 1 నుంచి 18 ఏళ్ల వయస్సు పై బడిన వారందరికీ ఇప్పుడే టీకా ఇవ్వలేమని..కొంత సమయం పడుతుందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. యువకులకు తప్పనిసరిగా టీకా ఉచితంగా అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. తమకు అవసరమైన మేరకు కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదని గురువారం నాడిక్కడ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1.75 కోట్ల మంది యువకులు ఉన్నారని..వీరందరికి రెండు డోసులు టీకా వేయడానికి 3.5 కోట్ల టీకాలు అవసరం ఉంటాయన్నారు. వీటన్నింటిని సమకూర్చుకోవడం కోసం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందించుకున్నా మన్నారు. వాక్సినేషన్ విషయంలో కేంద్రం ఇస్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. దేశ ప్రజలందరికి సమానమైన సేవలు అందజేయాల్సిన కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం తమ వద్ద వాక్సినేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందన్నారు. వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా, లైఫ్ సేవర్ డ్రగ్ అయిన రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో కేంద్రం ఉంచలేకపోతోం దన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదన్నారు. రాబోయే వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన మూడు వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామ న్నారు. కరోనా కట్టడిలో తమ రాష్ట్రం దేశంలోనే ముందున్నదని..దీని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్య సేవలు పొందాలన్నారు. టెస్టులు తర్వాత చేయించు కోవచ్చునని..ముందుగా వైద్య సేవలు అవసరం అన్నారు. కరోనా సోకిన అందరికి వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా పేరుగాంచిందని..అందుకే ఇక్కడ సగానికి పైగా రోగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు  వైద్య సేవలు పొందుతున్నారన్నారు. తమ వద్ద ఎక్కడా సిబ్బంది కొరత లేదన్నారు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ పరిస్థితిని తమ వ్యాపారంగా మార్చుకుంటు ఉన్నాయన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి ఆసుపత్రులపై కేసులు సైతం నమోదు చేస్తామన్నారు. మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో వ్యాపార దృక్పథం తో పని చేయడం సరైంది కాదన్నారు. వైద్యం పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తే..చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు. అధిక శాతం మందికి కరోనా సోకినప్పటికీ వైద్య సేవలు పొంది నయమవు తున్నారన్నారు. టీకా పంపిణీ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడాలన్నారు. అందరికీ టీకా పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్రం దేనన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేయాలని ఒకవైపు కేంద్రం ప్రకటించినప్పుడు అందుకు అవసరమైన టీకాలను సరఫరా చేయాల్సిన విషయలను విస్మరించడం దురదృష్టకరమన్నారు. చాలా మందిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. కేవలం కొద్ది మందికే కరోనా వైరస్ లక్షణాలున్నాయని.. వీరు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కేంద్ర ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిలన అవసరం లేదా…? ఈ విషయంలో తమ ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమార్కుల పట్ల కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తున్నామని ఆయన  వెల్లడించారు. ఆక్సిజన్ సిలిండర్ తో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ను బహిరంగ మార్కెట్ లలో అధిక ధరలకు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. కరోనా వైరస్ సోకిన వారికి అవసరమయ్యే పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రంలో కొత్తగా 19 వైద్య పరీక్ష కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. కోటి రూపాయల వ్యయంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు.రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయని… ప్రస్తుతం లాక్ డౌన్ పెట్టే యోచన ప్రభుత్వానికి లేదన్నారు.