మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Coronavirus hyderabad update : రోజు రోజుకు ఎక్కువవుతున్న కరోనా వైరస్ కేసులు..

Coronavirus hyderabad update : రోజు రోజుకు ఎక్కువవుతున్న కరోనా వైరస్ కేసులు..
  • దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 1.68 లక్షల కేసుల నమోదు..
  • 277 మంది మృతి..
  • తెలంగాణలో 1825 కేసుల నమోదు..
  • గ్రేటర్లో 1042 కేసుల నమోదు..
  • 2.74 లక్షల మందికి కి వ్యాక్సినేషన్..
  • 22,045 మందికి బూస్టర్ డోస్ 
  • టీఎస్ లో..కేసులు పెరుగు తుండడంతో ఈనెల 20 వరకు ఆంక్షల పొడిగింపు..

ఆర్సీ న్యూస్, జనవరి 11 (హైదరాబాద్): దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఎక్కువవు తున్నాయి. గత 24 గంటల్లో (సోమవారం వరకు) దేశంలో 1,68,063 కరోనా కేసులు నమోదు కాగా..277 మంది మృతి చెందారు. దీంతో దేశంలో థర్ద్ వేవ్ సందర్భంగా 3,58,75,790 కేసులు నమోదు కాగా.. 4461 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో సోమవారం నాడు 1825 కరోనా కేసులు నమోదు కాగా.. 351 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. జిహెచ్ఎంసి పరిధిలో 1042 కరోనా కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో 201, రంగారెడ్డి జిల్లాలో 147, సంగారెడ్డి జిల్లాలో 51, హనుమకొండలో 47, కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 2.74 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరగగా.. ఇందులో 1.3 లక్షల మంది కి ఫస్ట్ డోస్..1.39 లక్షల మందికి సెకండ్ డోస్..వాక్సినేషన్ జరిగింది. దీంతో పాటు 22,045 మందికి బూస్టర్ డోస్ వేశారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం అమల్లో ఉన్న ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించారు.

Coronavirus Hyderabad update : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెల 20 వరకు ఆంక్షలు కఠినతరం..

దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 6 తీసుకు వచ్చింది, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది. రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించ కూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. ఈమేరకు ఆదివారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై సర్కార్ నిషేధం విధించింది.

Coronavirus Hyderabad update : విధ్యార్థులకు సెలవులు పెరగొచ్చు..

ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల చదువుల సంబరం ఎంతో కాలం నిలిచేలా లేదు. థర్డ్ వేవ్ ఎంట్రీ వచ్చిందంటూ వైద్య శాఖ చెబుతుండటంతో ముందుగానే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులతో సర్దేసింది సర్కారు. ఇంతవరకు బానే ఉన్నా ఈ నెల 16తో సంక్రాంతి హాలీడేస్ ముగుస్తాయి. ఆ తర్వాత పరిస్థితే గందరగోళంగా మారింది.

రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ బడులు తెరుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలాఖరులో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుంటే.. స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితే ఉండదని నిపుణులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా… 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. దీంతో విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో 2020-21అకాడమిక్ ఇయర్ లో కేవలం నెల రోజులే ఫిజికల్ క్లాసులు నడవగా, మిగిలిన క్లాసులన్నీ ఆన్​లైన్​లోనే జరిగాయి. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పింది. 2021-22 అకడమిక్ ఇయర్ లో జులైలో ఆన్​లైన్, టీవీ పాఠాలు మొదలు కాగా కేసులు తగ్గడంతో సెప్టెంబర్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి.