areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మరచిపోలేని సంఘటన..మరపురాని బాధాకరం

ఆరేళ్ళ బాలిక అత్యాచారం.. హత్యపై వెళ్లువెత్తిన నిరసనలు..
 • ఆరేళ్ళ బాలిక అత్యాచారం.. హత్యపై వెళ్లువెత్తిన నిరసనలు..
 • ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతున్న ప్రజలు..
 • పోలీసుల అదనపు లో నిందితుడు..

ఆర్సీ న్యూస్, సెఫ్టెంబర్ 13 (హైదరాబాద్):  హైదరాబాద్ సింగరేణి కాలనీ ( సైదాబాద్ )లో ఆరేళ్ళ చిన్నారి గిరిజన బాలికపై అతి కిరాతకంగా.. అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధకరమని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోరమైన సంఘటనకు బాధ్యులైన పక్కింటి నివాసి రాజుని పట్టుకుని చట్టబద్ధంగా ఛార్జ్ షీటు నమోదు చేసి ఉరి శిక్ష వేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లీస్  పార్టీల నాయకులు, మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కోరారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరుల బ‌ృందం చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడు రాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్వాప్తంగా ఆందోళన, బాధ కలిగించిన ఈ సంఘటన పూర్వాపరాలను మరో సారి పరిశీలిస్తే..ఎంతటి కరుడుగట్టిన హ్రుదాయాలైనా..బద్దలవుతున్నాయి. అంతటి హ్రుదయవిధారకమైన సంఘటన ఇదీ…

అసలేం జరిగిందంటే…

 • దేవరకొండ, నక్కలగండి ప్రాజెక్ట్ ముంపు లో భూములు కోల్పోయి అరకొర నష్టపరిహారంతో పొట్టచేత పట్టుకొని నగరం చేరి, ఆటోను నడుపుకుంటున్న రాజు అతడి భార్య జ్యోతి గత నాలుగు సంవత్సరాలుగా సింగరేణి బస్తీలో వుంటున్నారు.
 • వారికి ముగ్గురు పిల్లలు.
 • అందులో పెద్ద పాపకు (బాధితురాలు) ఆరేండ్ల వయసు. 
 • మిగితా ఇద్దరు మగపిల్లలలో ఒకరికి మూడేండ్లు, మరొకరికి ఏడాది.
 • 9.9.2021నాడు సాయంత్రం 4.30 ప్రాంతంలో పిల్లల తల్లి పాపకు స్నానం చేయించి బట్టలు వేసింది.
 • మిగతా ఇద్దరి పిల్లలకు స్నానాలు చేయించడానికి లోపలే ఉండిపోయి, తర్వాత ఇంటిపనిలో మునిగిపోయింది.
 • పాప ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా తల్లి ఇంటి లోపల రొట్టెలు చేస్తున్నది. 
 • అంతలో చిన్నపిల్లలు ఇద్దరు లోపలికి వచ్చి ఆడుకుంటూ కనబడ్డారు.
 • కొద్దిసేపటి తర్వాత ఆ తల్లి బయటకు వెళ్లి చూస్తే పాప అక్కడ కనిపించకపోవడంతో వాళ్లకు దగ్గర్లో వున్న పిల్ల మేనత్త ఇంటికి వెళ్లిందో లేక అక్కడ ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద ఆడుకునేందుకు వెళ్లిందో  అని వెతకడం మొదలు పెట్టింది.
 • ఆ విషయం బస్తీలో ఉన్నవారికి తెలిసి వారూ వెతకడం ప్రారంభించారు.
 • ఎక్కడ వెతికినా పిల్ల కనబడక పోవడంతో తాళం  వేసివున్న పక్కింటి మీద అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడడానికి బస్తీవాసులు పోలీసులను ఆశ్రయించారు. 
 • పీఎస్ లో ఫిర్యాదు సకాలంలో తీసుకోలేక పోవడం.. తాళం పగల గొట్టడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కు వచ్చి సిసి కెమెరాల ఆధారంగా మళ్లీ బస్తీ మొత్తం గాలించడం  మొదలు పెట్టారు.
 • రాత్రి 12.00 గంటల సమయంలో అక్కడి బస్తీ వాసుల వత్తిడి మేరకు పోలీసులలో స్పందన వచ్చింది.
 • ఈ లోపల ఏసీపి గారి అనుమతి రావడంతో పోలీసుల సమక్షంలో ఆ ఇంటి తాళం పగలగొట్టి చూడగా.. పాప అత్యంత దారుణంగా, రక్తపు ముద్దగా పరుపులో చుట్టబడి విగతజీవిగా కనబడింది. 
 • కాళ్ళ మీద రక్తపు మరకలతో నోట్లో దూది కుక్కి, మెడపైన,
 • గొంతు మీద గోర్లు, పంటి గాట్లతో అత్యంత దారుణంగా హత్య, ఆత్యాచారానికి గురైన చిన్నారిని చూసి బస్తీవాసులు దిగ్భ్రాంతి చెందారు.
 • అప్పటిదాకా అక్కడే వున్న నిందితుడు పాపకోసం అందరూ వెదకడం చూసి అక్కడినుంచి పరారయ్యాడు. 
 • ఆ దుర్మార్గుడు రాజు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు గ్రామం నుండి వలస వచ్చి అక్కడ స్థిరపడిన వ్యక్తిగా అక్కడి వారు చెబుతున్నారు.  
 • అతని తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లితో కలిసి అంబరుపేట బస్తీలో గత 17 సంత్సరాలు వున్నాడని… ఉప్పల్ ప్రాంతంలో ఇండ్లల్లో పనిచేసే అతని తల్లి ఏడాది క్రితం ఈ బస్తీలో ఇల్లు కొని ఇక్కడే వుంటున్నారని బస్తీ వాసులు చెప్పారు. 
 • అతనికి పెళ్ళై పది నెలల ఆడపిల్ల కూడా వుందని..
 • ఆమె గత మూడు నెలల క్రితం భర్త వేధింపులతో విసిగిపోయి, అతని ప్రవర్తన నచ్చక తల్లిగారి ఇంటికి వెళ్లిపోయిందని తెల్సింది. 
 • అతని తల్లితో కూడా తరుచుగా గొడవ పడేవాడనీ..ఆమె కూడా భరించలేక దూరంగా ఉంటున్నదని స్థానికులు చెప్పారు. 
 • ఈ నేరస్తునికి తాగుడు, గంజాయి లాంటి మత్తుమందుల అలవాటు తో పాటు పోలీసులు చెప్పిన ప్రకారం గతంలో బైకును దొంగతనం చేసిన ఆరోపణ కూడా వున్నట్లుగా తెల్సింది.
 • అలాంటి దుర్మార్గుడుని కఠినంగా శిక్షించాలని పాప తల్లి తండ్రులు, బస్తీ వాసులు కోరుకుంటున్నారు. 
 • జిల్లా కలెక్టర్ వచ్చి తక్షణ సహకారం అందించి నేరస్తునికి తగిన శిక్ష వేయిస్తామని భరోసా ఇచ్చినప్పటికి.. ఒక ఉన్మాదుని చేతిలో అత్యంత దారుణంగా చంపబడిన తమ పాపను ఎలా తిరిగి తెస్తారన్న వారి రోదనలు ఆకాశాన్ని అంటుతూ.. అక్కడ అందరి హృదయాలను కలిచివేయడం ఒక ఎత్తైతే కన్నతల్లి కడుపుశోకం తీరని లోటని చెప్పక తప్పదు. 
 • అందరి డిమాండ్స్ ఒక్కటే.. ఇలా
 • చిన్నారి హంతకుడిపై పొక్సో, అత్యాచారం, హత్య, కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులు నమోదు చేసి చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలి.
 • మహిళలపై, మైనర్ బాలికలపై పెరుగుతున్న హింస, లైంగిక దాడులను అరికట్టాలి. 
 • అందుకోసం ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణను రూపొందించి అమలు చేయాలి.                                      
 • గిరిజన, ఆదివాసీ దళిత అడబిడ్డలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
 • బిడ్డను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం చట్టబద్ధంగా నష్ట పరిహారం ఇవ్వాలి. ఆర్థిక సహాయం, నివాసం, ఉద్యోగం ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలి.