- ఈద్గాలతో పాటు మక్కా మసీదులో సామూహిక ప్రార్ధనలు
- కొనసాగిన ట్రాఫిక్ ఆంక్షలు..ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాల దారి మళ్లింపు
-
ముస్లిం ప్రజలకు ఈద్ ముబారక్ చెప్పిన నగర సీపీ అంజనీకుమార్
ఆర్సీ న్యూస్,జూలై 21 (హైదరాబాద్): బక్రీద్ పండుగ ఘనంగా జరిగింది. బుధవారం నగరంలో జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ..ముస్లింలో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్ధనలలో పాల్గొన్నారు. నగరంలోని మక్కా మసీదుతో పాటు ఈద్గాలలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించిన ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసు కున్నారు. మీరాలం ఈద్గాలో జరిగిన సామూహిక ప్రార్దనలలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తో పాటు నగర అదనపు పోలీసు కమిషనర్ షికా గోయల్, నగర అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) అనీల్ కుమార్, నగర ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ రాములు నాయక్ తదితరులు పాల్గొని బందోబస్తును పర్యవేక్షించి ముస్లింలకు ఈద్ ముబారక్ తెలియజేశారు. నగరంలో బుధవారం ఎక్కడ చూసినా బక్రీద్ పండుగ సందడి నెలకొంది. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అసవరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. పండుగ సందర్బంగా ఖరీదు చేసిన మేకలు,పోట్లెళ్లను అల్లాహ్ కు ఖుర్బానీ ఇచ్చారు. గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బక్రీద్ పండుగను జరుపుకున్నప్పటికీ…ఈద్గాలలో సామూహిక ప్రార్దనలకు ప్రభుత్వం అనుమతించ లేదు. దీంతో ముస్లీంలు సామూహిక ప్రార్ధనలను తమ తమ ఇళ్లల్లోనే జరుపుకున్నారు. ఐతే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మసీదులతో పాటు ఫవిత్రంగా బావించే ఈద్గాలలో కూడా సామూ హిక ప్రార్ధనలకు అనుమతించడంతో ముస్లింలు బుధవారం ఈద్గాలలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. బక్రీద్ సందర్బంగా ఈద్గాలలో నిర్వహించే సామూహిక ప్రార్ధనలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబందిత ఉన్నతాధికారులను ఆదేశించడంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పండుగ సందర్బంగా ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించడానికి వచ్చే ముస్లింలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుంగా తగిన చర్యలు తీసుకున్నప్పటికీ..బుధవారం ఉదయం నుంచే వర్షం కురువడంతో వీధులన్నీ బురద మయంగా మారాయి. ఈద్గాలలో వేసిన షామియానాలు తడిసి ముద్దయ్యాయి. కొంత మంది ముస్లింలు పూర్తిగా తడిచిపోయారు. అయినప్పటికీ..సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్దరించడానికి మోబైల్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు మాదన్నపేట్ ఈద్గాలలో అందుబాటులో ఉంచారు. నగరంలో బుధవారం ఉదయం జరిగిన బక్రీద్ సామూహిక ప్రార్ధనల సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి. మీరాలం ఈద్గాతో పాటు మాదన్నపేట్ ఈద్గాలకు సమీపంలో తాత్కాలిక వాహనాల పార్కింగ్ లను ఏర్పాటు చేశారు. సామూహిక ప్రార్ధనల సందర్బంగా రెగ్యులర్ ట్రాఫిక్ కు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అవసరమైన మేరకు కొద్దిసేపు వాహనాలను దారి మళ్లించారు. కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారుల సూచనల మేరకు ముస్లిం ప్రజలు మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించారు. కొంత మంది మాకు ఏమవుతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వర్షం కురుస్తుండడంతో కొంత మంది ముస్లింలు ఇళ్లల్లో వజూ చేసుకుని వచ్చినట్లు సమాచారం. మక్కా మసీదు కతీబ్ హాఫేజ్ మహ్మద్ రిజ్వాన్ ఖురేషీ మీరాలం ఈద్గాలో బుధవారం ఉదయం 9.30 గంటలకు నమాజ్ చేయించగా..మక్కా మసీదులో జామే నిజామియా ఉర్దూ విశ్వవిద్యాలయం ఫ్రొఫేసర్ మహ్మద్ లతీఫ్ అహ్మద్ ముస్లింలతో నమాజ్ చేయించారు. అనంతరం బక్రీద్ ప్రాముఖ్యతను అరబిక్ లో వివరించారు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..