areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కులవృత్తులకు పూర్వవైభవం..

కులవృత్తులకు పూర్వవైభవం..
  • కుల వృత్తులంటే సీఎం కేసీఆర్ కు అభిమానం..
  • అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి..
  • ఇందులో భాగంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు.. 

 

ఆర్సీన్యూస్, సెఫ్టెంబర్ 17(హైదరాబాద్):  రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆప్కారి,క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుల వృత్తులంటే సీఎం కేసీఆర్ కు ఎంతో అభిమానం అన్నారు. రాష్ట్రం లోని కుల వృత్తులు అన్నింటిని అభిమానిస్తూ.. వారందరికీ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గౌడ , ఎస్సీ, ఎస్టీ  కులస్తులకు వైన్ షాప్ లలో రిజర్వేషన్లు కల్పించినందుకు క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు కులసంఘాలతో శుక్రవారం రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో పలు దుకాణాలు తెరిపించి గౌడ ఆత్మగౌరవాన్ని నిలిపారన్నారు. గౌడ్ మాత్రమే ఉత్పత్తి చేసేలా జీవో తీసుకొచ్చారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాలం నాటి నుండి ఉన్న డిమాండ్ ఏ ప్రభుత్వాలు వృత్తి పన్ను రద్దు చేయలేదనీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వృత్తి పన్ను రద్దు చేసి ఉచితంగా గీత కార్మికులకు లైసెన్సులు జారీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులంటే..ఎంతో అభిమానమన్నారు. కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకురావాలనే సంకల్పంతో చిన్న చిన్న కుల వృత్తుల  అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దళితులు, గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దళిత బందు తీసుకువచ్చారన్నారు. ఇందులో భాగంగా దళితులు, గిరిజనులు వైన్ షాప్ లలో రిజర్వేషన్లు అందుబాటులో కి తెస్తున్నామన్నారు. దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం వాటా  గౌడ్ లకి 15 శాతం వాటాను కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను నాశనం చేశాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తుల అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారన్నారు. గతంలో బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు గౌడులు మాత్రమే నిర్వహించే వారన్నారు. కుల వృత్తులను కొందరు నాశనం చేశారని..సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు గౌడ్ లకు 15 శాతం వైన్ షాప్ లలో వాటా కల్పించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చే భాగంలో నాయి బ్రాహ్మణులకు సెలూన్లు, రజకులకు ఆధునిక వాషింగ్ మిషన్లు, యాదవులకు గొర్రెలను, ముదిరాజులకు వారి వృత్తికి సంబంధించిన ప్రోత్సాహకాలను అందిస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కు వెయ్యి స్కూల్స్ పెట్టి ఆధునిక విద్యను అందిస్తున్నారన్నారు. కుల వృత్తులను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అన్ని కులాల, వృత్తుల ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం జాతీయ స్థాయి విప్లవానికి నాంది గా నిలువబోతుందన్నారు. ఇప్పటికే దేశంలో వివిద రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుండి ఫోన్లు వస్తున్నాయన్నారు. దేశంలో 60 శాతం కి పైన ఉన్న బీసీలకు స్వాతంత్ర్యం వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. బీసీల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ స్కీం ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తూన్నాయన్నారు. గౌడ్ లు,ఎస్సీ, ఎస్టీ ప్రజలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉండాలన్నారు. వైన్ షాప్ లలో గౌడ్ లకు 15 శాతం వాటా ను కల్పించినందుకు స్వాగతించాలన్నారు. 

ఈ సమావేశంలో MLC గంగాధర్ గౌడ్, సీనియర్ శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా. విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ స్కాలర్స్  కేషబోయిన రవికుమార్ గౌడ్, గదరాజు చందు, రాథోడ్ నాయక్, శ్రీరామ్ గౌడ్, SC నాయకులు జంబులయ్య, ST నాయకులు కిషన్ నాయక్ తదితర రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల  ప్రతినిధులు పాల్గొన్నారు.