ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..
  • కరోనా నిబంధనలు భేఖాతరు..
  • రాత్రి 12:00 నుంచి చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్..
  • పీకల దాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులు..
  • బంజారాహిల్స్ లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన మందుబాబులు..
  • హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్..
  • నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన సి వి ఆనంద్..

ఆర్సీ న్యూస్, జనవరి 01 (హైదరాబాద్): రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2021 ఏడాదికి గుడ్ బై చెబుతూ 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకల్లో యువతీ యువకులు నిండా మునిగి పోయారు. పబ్బులు, రెస్టారెంట్లు అన్నీ యువతతో కిక్కిరిసిపోయాయి. తాగారు.. ఆడారు.. ఊగారు.. మైమరిచి పోయారు. కొంత మంది యువతీ యువకులు పీకలదాకా తాగి అక్కడక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లోని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మందు బాబులు తమను తాము మరిచిపోయి మందు సేవించడం లో పూర్తిగా నిమగ్నమయ్యారు. కొంత మంది వారి వారి ఇళ్లకు చేరుకోగా.. మరి కొంత మంది ఎక్కడ పార్టీ చేసుకున్నారో.. అక్కడే రాత్రంతా గడిపి తెల్లవారు జామున ఇళ్లకు చేరుకున్నారు. మధ్యం సేవించని వారు గమ్మున పడుకుని తెల్లవారినంక వారి వారి  పనుల్లో నిమగ్నమయ్యారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని కీలకమైన అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగింది. బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ యువతి యువకుడు విధి నిర్వహణలోని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర స్థాయిలో దూషిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తాము ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి పోలీసుల చొక్కాలు పట్టుకుని నెట్టి వేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 12 గంటలకు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ తో పాటు కెబిఆర్ పార్క్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, కోటి లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చార్మినార్ ఇతర ప్రాంతాలలో సంబంధిత సీనియర్ పోలీసు అధికారులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో కేకులు కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియ జేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సి వి ఆనంద్ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాదు సిటీ పోలీసు తరపున నగర ప్రజలకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు: సి.వి.ఆనంద్..

హైదరాబాదు సిటీ పోలీసు తరపున నగర ప్రజలకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు: సి.వి.ఆనంద్..

నూతన సంవత్సరములో మీరు మీ పిల్లలు  ఆందరు బాగుండాలి.. మరియు మీ ఆశయాలు అన్ని నెర వేరాలని  కోరుకుంటున్నాను. గత రెండు సంవత్సరముల నుండి మన మందరము కోవిడ్ వైరస్ మహ్మారి వలన బాధపడినాము. మరియు మన పిల్లలు స్కూల్లు, కాలేజీలు మూసి ఉండటము వలన  వారు చాలా విధ్యాభ్యాసాన్ని కోల్పోయినారు. ఈ సంవత్సరము  బాగుండాలి అని మరియు ఈ కోరోనా వైరస్ బారి నుండి మనకు విముక్తి కలుగుతుంది అని ఆశిస్తున్నాను. మన రోజు వారి జీవిత కార్యక్రమాలు  సాధారణ స్థితికి  వస్తుందని ఆశిస్తున్నాను. హైదరాబాదు సిటీ పోలీసు ఎల్లప్పుడు మీ సేవలో ఉంటుంది. ఈ నూతన సంవత్సర వేడుకలలో మీరందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. మాస్కులు ధరించాలి, సామాజిక దూరము పాటించాలి.  వచ్చే సంవత్సరము హైదరాబాదు సిటీ పోలీసు ఇంకా మెరుగైన సేవలు, శాంతి భద్రతలు, నేరాలను అదుపు చేయటము, మహిళా భద్రత, మహిళల పట్ల జరిగే నేరాలు మరియు ట్రాఫిక్ మేనేజ్ మెంట్  అన్ని రకాలుగా మేము హైదరాబాదు సిటీ పోలీసు తరపున ఇంకా కష్ట పడి అదుపులో పెడతామని నేను హామి ఇస్తున్నాను. మీరందరు సంతోషముగా ఉండాలి అని  శ్రీ సి.వి ఆనంద్ అన్నారు.