ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బాధిత మహిళలు షీ టీమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..

బాధిత మహిళలు షీ టీమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..
  • ఘనంగా షీ టీమ్స్ ఏడో వార్షికోత్సవం
  • హాజరైన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్
  • సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న షీ టీమ్స్
  • 2014 అక్టోబర్ 24న ప్రారంభం..
  • ఇప్పటి వరకు 8000 మంది బాధిత మహిళల కుటుంబాలకు అండగా ఉన్న షీ టీమ్స్ …

ఆర్సీన్యూస్,అక్టోబర్ 23 (హైదరాబాద్): మహిళల భద్రత, రక్షణ కోసం పని చేస్తున్నషీ టీమ్స్ ఏడో వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ పాతబస్తీ దక్షిణ మండలంలో శనివారం ఘనంగా జరిగాయి.నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆధ్వర్యంలో నగర అదనపు సీపీ, షీ టీమ్స్ ఇంచార్జి షికా గోయల్, షీ టీమ్స్ డీసీపీ శిరీష తదితరుల పర్యవేక్షణలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఏడేళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. నగర పోలీసు కమిషనర్ పరిధిలో పని చేసే షీ టోమ్స్ గత ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధిస్తోంది. బాధిత మహిళల కుటుంబాలను ఆదుకుంటూ వారికి అవసరమైన మేరకు సలహాలు,సూచనలు అందజేస్తోంది. నాంపల్లిలోని హాకా భవనంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న షీ టీమ్స్..దక్షిణ మండలం బాధితుల సౌకర్యార్ధం వారంలో ఒక రోజు ఇక్కడ పని చేయడానికి ప్రత్యేకంగా ‘సాత్..సాథ్ అబ్ ఓౌర్ బీ పాస్..‘ అనే పేరుతో ఎక్స్ టెన్షన్ సెంటర్ ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొత్తగా ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకల సందర్బంగా పాతబస్తీలో కొత్తగా వారంలో ప్రతి బుధవారం పని చేసే విధంగా సెంటర్ ను ఆయన ప్రారంభించి బాధిత మహిళలకు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మహిళలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ..వారి భద్రత కోసం 2014 అక్టోబర్ 24న, షీ టీమ్స్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8000 బాధిత మహిళల కుటుంబాలకు షీ టీమ్స్ అండగా నిలిచింది. అంతేకాకుండా 687 మందిపై కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. 723 పిటీ కేసులు నమోదు చేసి 942 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని కేసులు నమోదు చేశారు. అవసరమైన మేరకు బాధిత మహిళా కుటుంబాలకు సలహాలు,సూచనలు అందజేసి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడైనా బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే షీ టీమ్స్ స్పందిస్తు ఆదుకుంటోంది. వారికి ధైర్యం చెబుతూ అండగా నిలుస్తోంది. 7వ వార్షికోెత్సవం సందర్బంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ..షీ టీమ్స్ పని తీరును అభినందిం చారు. బాధిత మహిళలను ఆదుకోవడం కోసం షీ టీమ్స్ రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని పకడ్బంధీ చర్యలు తీసుకున్నప్పటికీ.. సమాజంలోని కొంత మంది సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు అఫ్పుడప్పుడు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించడానికి ప్రజల సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరమన్నారు. తమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం బాధిత మహిళలు వెంటనే షీ టీమ్స్ యాప్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్ కోరారు. అంతకు ముందు షీ టీమ్స్ ఇంచార్జి షికా గోయెల్ మాట్లాడుతూ…తమకు ఫిర్యాదు చేసే వారి సమాచారాన్ని తాము గోప్యంగా ఉంచుతామన్నారు. సమస్యల పరిష్కారం కోసం తమను సంప్రదించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ రమేష్, దక్షిణ మండలం అదనపు డీసీపీ రఫీక్, చార్మినార్ ఏసీపీ బిక్షం రెడ్డి, చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ రాములు నాయక్, చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.