areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బిగ్ బాస్ లో అసలేం జరుగుతోంది..

బిగ్ బాస్ లో అసలేం జరుగుతోంది..
  • రవి ఎలిమినేషన్ తో అందరి చూపు బిగ్ బాస్ వైపు..
  • తనను ఎలిమినేట్ చేయడంతో షాక్ కు గురయ్యానంటున్న యాంకర్ రవి..
  • ఓట్లు లో ఉన్నాయంటే నమ్మలేనంటున్న రవి..
  • తప్పు జరిగింది..అది ఎక్కడో తెలియాలి..
  • నిర్వాహకులు సైతం తన ఎలిమినేషన్ పట్ల ఫీల్ అవుతున్నారు.
  • ఎలిమినేషన్ అనంతరం మీడియాతో యాంకర్ రవి..
  • తనను ఎలిమినేట్ చేయడంతో షాక్ కు గురయ్యానంటున్న యాంకర్ రవి..
  • ఆర్సీ న్యూస్ నవంబర్ 29 (హైదరాబాద్): బిగ్ బాస్ సీజన్ ఫైవ్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు బిగ్ బాస్ చూడ్డానికి ప్రేక్షకులు ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ ఐనా శని,ఆదివారాల్లో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎందుకంటే శని,ఆదివారాల్లో ఎలిమినేషన్ రౌండ్ ఉన్నందున ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. బిగ్ బాస్ ప్రారంభమై ఈ ఆదివారానికి 84 రోజులు పూర్తికాగా.. ఏడుగురు కంటెస్టెంట్ లు బరిలో ఉన్నారు. శ్రీ రామచంద్ర, యాంకర్ రవి, కాజల్, సిరీ, షణ్ముఖ్, ప్రియాంక, మానస తదితరులు 84 వ ఎపిసోడ్ వరకు ఉన్నారు. ఇందులో మానస్ తప్పా.. మిగిలిన ఆరుగురు అన్ సేఫ్ లో ఉన్నారు. ఇక ఈ ఆదివారం ఉన్నట్లుండి యాంకర్ రవి ఎలిమినేషన్ కావడంతో రవి అభిమానులు,సపోర్ట్ ర్స్, బంధు-మిత్రులు ఆందోళనకు గురయ్యారు. చివరి వరకు ఉంటాడు అనుకున్న రవి హఠాత్తుగా ఎలిమినేట్ కావడ మేమిటి అని ప్రశ్నించుకుంటున్నారు. ఏదో జరిగింది.. అందుకే రవిని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎలిమినేట్ అయిన అనంతరం రవి మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదని అనడంతో ఆయనను సపోర్ట్ చేస్తున్న వారి ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. ఆదివారం రాత్రి కొంత మంది సపోర్టర్స్ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుని రవి కి మద్దతుగా నినాదాలు చేశారు. టాప్ ఫైవ్ లో ఉంటాడు అనుకున్న యాంకర్ రవి 84 వ, రోజులు ఎలిమినేట్ కావడం పట్ల ఆయనతో పాటు ఆయన అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎక్కడో పొరపాటు జరిగిందని.. ఆ పొరపాటు ఏంటో తెలుసుకుంటానని యాంకర్ రవి అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..”ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించగానే..ఇలా జరుగుతుందని తాను ఎక్స్ ఫెక్ట్ చేయ లేదన్నారు. ఇలా ఎందుకు అయిందో అర్థం కావడం లేదన్నారు. ఓట్లు తక్కువగా ఉన్నాయని..అందుకే ఎలిమినేట్ అయినట్లు చెబుతున్న దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలుసుకుంటానన్నారు. ఓట్లు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని తాను నమ్మలేం అన్నారు. సన్నీ ఎవిక్షన్ ఫ్రీ కార్డు వాడతాడని తెలుసు.. అయితే సన్నీ ఇచ్చిన ఫ్రీ కార్డు కాజల్ కు ఉపయోగపడ లేదన్నారు. నిర్వాహకులు కూడా తన ఎలిమినేషన్ పట్ల తప్పు జరిగిందని ఫీలవుతున్నారన్నారు. తన ఎలిమినేషన్ కు ఏ కంటెంట్ చూపించారో తెలియదన్నారు. తన ఎలిమినేషన్ పట్ల బిగ్ బాస్ తప్పు తీర్పు అని ప్రజలు అంటున్నారని…నాకు ప్రజల సపోర్టు ఉందన్నారు. గేమ్ పరంగా నాకు క్లారిటీ ఉంది. బిగ్ బాస్ లో బాగా పర్ఫామెన్స్ చేస్తున్న ఇద్దరు ముగ్గురు లో నేను కూడా ఉన్నాను. బిగ్ బాస్ ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నాను…” అంటూ ఆయన తన ఎలిమినేషన్ పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్ రవి మీడియా ముందు తన మనోగతాన్ని తెలియజేయడంతో బిగ్ బాస్ లో అసలు ఏం జరుగుతోంది అంటూ ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో జరుగుతుందంతా.. స్క్రిప్టు ప్రకారమే జరుగుతోందని.. స్వతహాగా కంటెస్టెంట్ లు వ్యవహరించే అవకాశమే లేదని.. అపవాదు ఉంది. దీనిని బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు గతంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ లు సైతం అంగీకరించ లేదు. ప్రస్తుతం టాప్ త్రీ వరకు రవి ఉంటూ టైటిల్ విన్నర్ కోసం పోటీపడతారని భావించిన ఆయన అభిమానులకు ఆదివారం నాటి ఎలిమినేషన్ తీవ్ర మనస్తాపం కలిగించిందని తెలుస్తోంది.అసలు బీబీ లో ఏం జరుగుతోందనే విషయాన్ని కాన్టెస్టెంట్స్ ఓపెన్ గా వచ్చి మనసు విప్పి మాట్లాడితేనే బాహ్య ప్రపంచానికి తెలుస్తుందని ప్రజలు అంటున్నారు.