- ఏపీలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ లు..
- కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు..
- మరికొన్నింటి దారి మళ్లింపు..
- ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు..
- భారీ వర్షాలతో 172 రైళ్ల రద్దు..
- పాక్షికంగా 29 రద్దు కాగా.. మరో 108 దారి మళ్లింపు..
ఆర్సీ న్యూస్, నవంబర్ 22(హైదరాబాద్): జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. తిరుపతి,రాజంపేట లోని పలు ప్రాంతాలు, గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు తగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా 172 రైళ్ల రాకపోకలను రద్దు చేయగా.. 29 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 108 రైళ్ల రాకపోకలను దారి మళ్లించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు, విజయవాడ డివిజన్లలో కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19, 20, 21, 22, 23, 24 తేదీల్లో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి, తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించేవి కలిపి మొత్తంగా 172 రైళ్లు రద్దయ్యాయి. మరో 29 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 108 రైళ్లను దారి మళ్లించి నడిపించారు. 5 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చగా రెండింటికి గమ్యస్థానం కుదించారు.
గుంతకల్లు డివిజన్‌లో నంద లూరు-రాజంపేట, రేణిగుంట-పుడి, ధర్మవరం-పాకాల సెక్షన్..విజయవాడ డివిజన్‌లో నెల్లూరు-పడుగుపాడు సెక్షన్లలో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండడంతో… పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. రైళ్లు రద్దవ్వడం..కొన్నిచోట్ల గమ్యస్థానం కుదించడంతో ప్రయాణికులు రైల్వే అధికారులతో పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. కొందరు సమాచారం అందక రైల్వే స్టేషన్లకు వెళ్లారు.
పూర్తిగా రద్దయిన రైళ్ల రూట్లు ఈ క్రింద విధంగా ఉన్నాయి…
- పూర్తిగా రద్దయిన వాటిలో 21న బయల్దేరాల్సిన రైళ్లలో గుంతకల్లు- రేణి గుంట- గుంతకల్లు, గుంతకల్లు-తిరుపతి, విజయవాడ-చెన్నై సెంట్రల్, కరీంనగర్- తిరుపతి, నిజామాబాద్-తిరుపతి, తిరుపతి-ఆదిలాబాద్-తిరుపతి, కాచిగూడ-వాస్కోడగామా, విజయవాడ-గూడురు, గూడూరు- రేణిగుంట-గూడూరు, కాచిగూడ- చెంగల్పట్టు, కాచిగూడ-చిత్తూరు- కాచిగూడ, సికింద్రాబాద్-తిరువనంత పురం, గూడురు-సికింద్రాబాద్, లింగంపల్లి-తిరుపతి-లింగంపల్లి, హైదరాబాద్-చెన్నైసెంట్రల్-హైదరాబాద్ తదితర రైళ్లున్నాయి.
- ఈనెల 22న కాచిగూడ-తిరుపతి-కాచిగూడ, తిరుపతి-హజ్రత్‌నిజాముద్దీన్, నిజామాబాద్-తిరుపతి-నిజామాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు-కాచిగూడ రూట్లు రద్దయ్యాయి.
- ఈ నెల 23న, వాస్కోడగామా-కాచిగూడ, బెంగళూరు- హతియా, హజ్రత్‌నిజాముద్దీన్- మధురై, హజ్రత్‌నిజాముద్దీన్- ఎర్నాకుళం, చెన్నైసెంట్రల్- న్యూదిల్లీ- చెన్నైసెంట్రల్, న్యూదిల్లీ- త్రివేండ్రం, చెన్నై-హజ్రత్‌నిజాముద్దీన్- చెన్నై, చెన్నైసెంట్రల్-హజ్రత్‌నిజాముద్దీన్-చెన్నైసెంట్రల్, పట్నా-ఎర్నాకుళం, అహ్మదాబాద్- చెన్నైసెంట్రల్..
- 24న, తిరుపతి- హజ్రత్‌నిజాముద్దీన్ తదితర రూట్లలో రైళ్లు రద్దయ్యాయి.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..