ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సఫాయి అన్న.. సలాం నీకు..

సఫాయి అన్న.. సలాం నీకు..
  • స్వచ్ఛ హైదరాబాదులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అమోఘం..
  • చెత్త నుంచి మొదటిసారి 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
  • 6500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ..
  • 1350 స్వచ్ఛ ఆటోల ద్వారా తడి, పొడి చెత్త సేకరణ..
  • వచ్చే ఏడాది కూడా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చేటట్లు కృషి చేయాలి..
  • స్వచ్ఛ హైదరాబాద్ లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్
  • లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణి చేసిన మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్ 

ఆర్సీ న్యూస్, డిసెంబర్ 13 (హైదరాబాద్): సిఎం దిశ నిర్దేశంతో  స్వచ్ఛ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిపూర్ణంగా విజయ వంతం చేయాలని రాష్ట్ర  పురపాలక పట్టణాభివృద్ధి, ఐ.టి, చేనేత పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సోమవారం సనత్ నగర్ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 1350 స్వచ్ఛ ఆటోలను లాంచనంగా ప్రారంభించారు.  

సోమవారం జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర  పశుసంవర్దక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోం మంత్రి  మహమూద్ ఆలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,  కమిషనర్  లోకేష్ కుమార్ లతో కలిసి 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను   పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో బాగంగా సిఎం కేసీఆర్  స్వచ్ఛ హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండే ఉద్దేశ్యంతో  2500  స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. కేంద్ర  ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో 40 లక్షల పైబడిన జనాభా విభాగంలో హైదరాబాద్ నగరానికి అవార్డు వస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా  అవార్డు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.

మూడు, నాలుగు గంటలు శ్రమపడి ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు  మునిపల్ సిబ్బంది హైదరాబాద్ నగర ప్రజల  తరుపున అభినందనలు తెలిపారు.

 “సఫాయి అన్న.. సలాం” అన్న  మొట్టమొదటి ముఖ్య మంత్రి కేసీఆర్ మాటలతోనే సరిపెట్టకుండా 3 సార్లు గౌరవ వేతనం పెంచినట్లు చెప్పారు. 

ముఖ్య మంత్రి కేసీఆర్

2500 స్వచ్ఛ అటోల పంపిణీ కంటే ముందు హైదరాబాద్ నగరంలో  3500 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలను  సేకరించేవారన్నారు. ఇంటింటికి తిరిగి  తడి, పొడి చెత్తలను వేర్వేరుగా  సేకరిస్తున్నారు. నేటికీ అది 6500 మెట్రిక్ టన్నులు సేకరణ చేయడం జరుగుతున్నది. వాహనాల ద్వారా సేకరించిన చెత్తను  సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. తద్వారా మెరుగైన పారిశుద్ద్యానికి వెసులుబాటు కలిగింది. జిహెచ్ఎంసి పరిధిలో 1350 స్వచ్ఛ ఆటోలు కలిసి మొత్తం 4500 ఆటోలు కలవన్నారు.

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద దైన చెత్త నుండి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ)  ప్లాంట్ జవహర్ నగర్ లో  జిహెచ్ఎంసి ద్వారా మొట్టమొదటగా 20 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.  మరో 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినందున మొత్తం 48మెగావాట్ల విద్యుత్తు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో   నిర్వహించడం దక్షిణ భారతదేశంలో అతి పెద్దది కావడం విశేషమన్నారు.

1350 స్వచ్ఛ ఆటోల వలన నగరంలో  మూలమూలకు విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్యం మెరుగు పడుతుందని, కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కొరకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి  మాట్లాడుతూ… స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో బాగంగా గౌ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారన్నారు. జిహెచ్ఎంసిలో తడ, పొడి చెత్త  సేకరణ కొరకు ఆటోల పంపిణీ మంచి ఆలోచనలతో తీసుకున్న నిర్ణయమన్నారు. రెండోసారి 1350 ఆటోల పంపిణీ వలన హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మరింత  మెరుగు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ప్రియాంక అలా,  ఖైరతాబాద్  జడ్.సి రవి కిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, డి.సి లు,   స్థానిక కార్పొరేటర్  శ్రీమతి లక్ష్మి బాల్ రెడ్డి, బేగం పేట్ కార్పొరేటర్  మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.