areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సినీ నటి అనన్య పాండే ను మూడో సారి ప్రశ్నించనున్న ఎన్సీబీ..

సినీ నటి అనన్య పాండేను మూడో సారి ప్రశ్నించనున్న ఎన్సీబీ..
  • ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించిన ఎన్సీబీ
  • శుక్రవారం తండ్రి చుంకీ పాండేతో కలిసి హాజరు.
  • ఆర్యన్ ఖాన్ తో ఛాటింగ్ పై ఆరా..
  • డ్రగ్స్ సఫ్లై చేస్తానని ఎందుకు ఛాట్ చేశావని ప్రశ్నించిన ఎన్సీబీ.
  • జోక్ చేశానని చెప్పిన అనన్య పాండే

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 23 (ముంబాయి): బాలీవుడ్ సినీ నటి, చుంకీ పాండే కుమార్తె అనన్య పాండేను సోమవారం మూడో సారి ప్రశ్నించ డానికి ఆంటీ డ్రగ్స్ ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీ బీ)మరోసారి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఎన్ సి బి అధికారుల బృందం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించి ల్యాప్ టాప్,మోబైల్ తదితర వాటిని స్వాధీనం చేసుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం శుక్రవారం ఉదయం అనన్య పాండేను ఎన్సీబీ అధికారుల బృందం రెండోసారి ప్రశ్నించింది. ఎన్సీబీ  కార్యాలయానికి శుక్రవారం ఆమె తన తండ్రి చుంకీ పాండే తో కలిసి వెళ్లారు. అధికారులు ఆమెను పలు విధాలుగా ప్రశ్నించారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడి రిమాండ్లో ఉన్న ఆర్యన్ ఖాన్ కు అనన్య పాండే కు గల సంబంధాలపై పలు ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై అనన్య పాండే చేసిన చాటింగ్ పై ఆరా తీశారు. 2019 నుంచి అనన్య పాండే…ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ విషయంపై చాటింగ్ చేస్తున్న సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఒకానొక సందర్భంలో ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సప్లై చేస్తానంటూ అనన్య పాండే చేసిన వాట్సాప్ చాటింగ్ పై ఆరా తీశారు. ఈ ప్రశ్నకు అనన్య పాండే జవాబిస్తూ… తాను కేవలం జోక్ చేశాను అంటూ బదులు ఇచ్చారని తెలిసింది. అయితే ఇప్పటివరకూ అనన్య పాండే ఎక్కడ  డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దిష్టమైన ఆధారాలు తమకు లభించలేదని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ ఖరీదు చేసినట్లు కానీ.. తాను తీసుకున్నట్లు కానీ.. ఎక్కడ ఆధారాలు లభించలేదని వారు స్పష్టం చేశారు. అయితే క్రూయిజ్ పడవలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఎన్సీబీ అధికారులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడటం.. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే. ఈ విషయంలో మరింత లోతుగా ప్రశ్నించడానికి అనన్య పాండేను సోమవారం ఎన్సీబీ అధికారులు మరోసారి ప్రశ్నించ నున్నారు.