ఏప్రిల్ 25, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

థర్డ్ వేవ్ కు సిద్ధం. New Year celebrations కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి..

New Year celebrations కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి
  • బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు వద్దు..
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 కేసుల నమోదు..
  • దేశంలో పెరుగుతున్న కేసులు 3వ,వేవ్ కు సూచన..
  • రాబోయే 4 వారాలు ఎంతో కీలకం..
  • కరోనా జాగ్రత్తలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనాలి..
  • అమెరికాలో ఒక్క రోజే 4.65 లక్షల కేసుల నమోదు..
  • నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే చేసుకోవడం మంచిదని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది..
  • దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి..
  • అలాగే రాష్ట్రంలో కూడా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి..
  • దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది..

ఆర్సీ న్యూస్, డిసెంబర్ 30 (హైదరాబాద్): కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఎన్ని కేసులు పెరిగిన ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే తాము మూడవ వేవ్ కు దగ్గర అవుతున్నట్లు తెలుస్తుంది అన్నారు. అయితే అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున మూడవ వేవ్ వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే నాలుగు వారాలు ఎంతో కీలకంగా మారనున్నాయన్నారు. యు.ఎస్.లో ఒక్క రోజులోనే 4.65 లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు అరవై రెండు కేసులు నమోదయ్యాయన్నారు. సీనియర్ సిటిజన్స్ తోపాటు చిన్నారులకు బూస్టర్ డోసు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి
  • థర్ద్ వేవ్ కి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది.
  • నిన్న ఒక్కరోజే యుఎస్ లో సుమారు 4.65 లక్షల కేసులు నమోదు.
  • యుఎస్ , యూకే వంటి దేశాలో ఒమిక్రాన్  కేసులు భారీగా నమోదు.
  • తెలంగాణలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి.
  • వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకం.
  • డెల్టా కాంట్ర ఒమిక్రాన్ 30 రేట్లు  వేగంగా వ్యాప్తి చెందుతుంది అని కొన్ని స్టీడీస్ చెబుతున్నాయి.
  • 3వ వేవ్ కి పెరుగుతున్న కేసులే.. ఒక ఇండికేషన్..
  • 2 వేవ్ ల నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాము. 
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు.
  • అతి కొద్ది వారాల్లో గతంలో చూడని స్థాయిలో  కోవిడ్ కేసులు పెరిగే అవకాశం.
  • కొత్త వారియెంట్ సోకిన 95% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు.
  • 10% మందిలోనే లక్షణాలు ఉంటన్నాయి. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి.
  • ఐసోలాషన్ సమయాన్ని కూడా కొన్ని దేశాలు తగ్గించాయి.
  • సౌత్ ఆఫ్రికాలో టెస్టింగ్, ఐసోలాషన్ ని పూర్తిగా తొలగించారు.
  • లక్షణాలు లేని వారికి టెస్ట్ లు చేసి వ్యాధి ఉందని ముద్ర వేయాల్సిన అవసరం లేదు.
  • వృద్దులకు బూస్టర్, చిన్నారులకు  1st డోస్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాము.
  • నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలు 3వ వేవ్ కి ప్రారంభంగా నిలుస్తాయి.
  • కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 
  • 1% మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బెడ్స్, ఆక్సిజన్ పెద్ద మొత్తంలో కావాల్సి ఉంటుంది.
  • కొత్త సంవత్సర వేడుకలు కుటుంభం సభ్యుల మధ్య జరుపుకోవాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో వేడుకల్లో పాల్గొనే వారు అప్రమత్తంగా ఉండాలి.
  • టెస్ట్ ల సంఖ్య పెంచబోతునాము.
  • కొందరిలో తీవ్ర తలనొప్పి, నీరసం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
  • పాజిటివిటీ రేట్ 0.6 నుంచి పెరుగుతోంది. 
  • గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి 
  • డెల్టా, ఒమిక్రాన్ అని ఆలోచించవద్దు కోవిడ్ ఒకటే.
  • త్వరలో భారత్ బయోటెక్ నాజర్ స్ప్రే అందుబాటు లోకి రానుంది.
  • మొల్ను ఫిరావిర్ కూడా అందుబాటులో వుంటుంది.
  • ఒకేసారి లక్షల్లో కేసులు నమోదు అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని.లేదు.
  • భయంతోనే చాలా వరకు ప్రమాదం.
  • 3 వేవ్ కోవిడ్ కి ఒక అంతంగా ఉంటుంది అని చెప్పాలి.
  • 3 వేవ్ తో దాదాపు కోవిడ్ నుంచి విముక్తి దొరుకుతుంది.
  • 62 ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి.
  • అందులో 3 కేసులు కాంటాక్ట్ లేకుండా వచ్చాయి.
  • అన్ని శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సు చేయలేము.
  • ఇంతకు ముందు కోవిడ్ వచ్చినా కొందరిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
  • ఒమిక్రాన్ తో సామాజిక వ్యాప్తి ఉంది.