- యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిష్టగా స్వామివారి వ్రత పూజలు..
- రోజుకు నాలుగు సార్లు జరిగే వ్రత పూజలు..
- ప్రతి రోజు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం..
- సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు..
- టికెట్ ధర రూ. 800
- పూజలకు అరగంట ముందుగా టికెట్ల జారీ..
- గుట్ట కింద తూర్పు వైపు నిర్మించిన హాలులో వ్రత పూజలు..
ఆర్సీ న్యూస్, జనవరి 11 (హైదరాబాద్): ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుతూ భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను కుటుంబ సభ్యులతో పాటు బంధు,మిత్రులు పాల్గొని స్వామి వారి పూజా విధానం తో పాటు కథకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటారు. తమ తమ ఇళ్లతో పాటు ప్రధాన దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతం పూజలో పాల్గొంటారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం పనులు జరుగుతున్న యాదగిరి గుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల కోసం భక్తులు ప్రతి రోజు క్యూ కడతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది
Satyanarayana swamy vratham timings at yadadri
ఈ విషయమై ఆర్సీ న్యూస్ భక్తుల సౌకర్యార్థం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ లకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తోంది. యాదగిరిగుట్టలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు సార్లు స్వామి వారి వ్రత పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 గంటల నుంచి ఈ వ్రత పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు వ్రత పూజలు జరుగుతాయి. ప్రతి పూజ ప్రారంభానికి ముందు అంటే అరగంట ముందుగా టిక్కెట్లు జారీ చేస్తారు. వ్రత పూజ లో పాల్గొన్న వారు ఎనిమిది వందల రూపాయలు చెల్లించి టికెట్ ఖరీదు చేసుకొని కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అవసరమైన పూజా సామాగ్రి తో పాటు పాలు, పెరుగులను దేవస్థానం వారు ఉచితంగా అందజేస్తారు. అయితే ప్రసాదానికి అవసరమైన పళ్ళు, ఫలాలు, పూలు బయటి నుంచి ఖరీదు చేయాల్సి ఉంటుంది. గంట పాటు జరిగే ఈ వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతాయి. ఇతర ప్రాంతాల నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను నిర్వహించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అవసరమైన పార్కింగ్ సౌకర్యం ఉంది. అయితే పార్కింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. యాదగిరిగుట్ట పునర్ నిర్మాణానికి ముందు గుట్టపైన అందుబాటులో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు.. ప్రస్తుతం గుట్ట కింది భాగాన తూర్పు వైపు ప్రత్యేకంగా నిర్మించిన షెడ్డులో జరుగు తున్నాయి. గుట్టపైకి వెళ్లాల్సిన అవసరం లేదు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..