ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంగరంగ వైభవంగా మీరాలంమండి అమ్మవారికి మహాభిషేకం..

అంగరంగ వైభవంగా మీరాలంమండి అమ్మవారికి మహాభిషేకం..
  • వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు
  • బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం..
  • లాల్ దర్వాజ నుంచి బల్కంపేటకు ఊరేగింపు..
  • భాజాభజంత్రీల నడుమ పోతురాజుల విన్యాసాలతో కొనసాగిన బంగారు బోనం ఊరేగింపు

 ఆర్సీ న్యూస్,జూలై 13 (హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పుర స్కరించుకుని మంగళవారం మీరాలంమండిలోని చారిత్రాత్మకమైన శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి మహాభిషేకం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య ఆద్వర్యంలో జరిగిన ఈ మహాభిషేకం పూజా కార్యక్రమాలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. చాముండేశ్వరీ దేవీ దత్త పీఠ ఆస్థాన పండితులు శ్రీరామ శర్మ,మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ శర్మ,అలంకార బ్రహ్మ శ్రుంగారం ఆత్రేయాచార్యుల మంత్రోచ్చరణల నడుమ మహాభిషేకం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. 54 రకాల సుగంధ ద్రవ్యాలతో పాటు పంచామ్రుతాలు, వివిధ రకాల ఫల రసాలతో మహాభిషేకం జరిగింది. పలువురు అధికార,అనధికార ప్రముఖులు ఈ మహాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. పూజల సందర్బంగా దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రపాద వితరణ జరిగింది.

పాతబస్తీ నుంచి బంగారు బోనం, పట్టు వస్త్రాలు…

పాతబస్తీ నుంచి బంగారు బోనం, పట్టు వస్త్రాలు

అలాగే పాతబస్తీ నుంచి భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కె.ఎస్.ఆనంద్ రావు, ఆకుల వేణుగోపాల్, మధుసూదన్ గౌడ్, ప్యారసాని వెంకటేష్, గాజుల రాహుల్ తదితరుల బ్రుందం బల్కంపేట తల్లి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలతో భయలు దేరి వెళ్లారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరారు. దారి పొడవునా పోతరాజుల న్రుత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వాహనాలలో బల్కంపేట్ చేరుకున్నారు. బల్కంపేటలో భాజాభజంత్రీల నడుమ పోతురాజుల న్రుత్యాతో ర్యాలీ నిర్వహించి అమ్మవారికి నేవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. బల్కంపేట వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాతబస్తీ నుంచి వచ్చిన బంగారు బోనం ఊరేగింపుకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బోనాల పండుగ సందర్బంగా గుళ్లకు నిధులను అందజేస్తున్నామన్నారు. అమ్మవారి దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి కేటగిరిల వారిగా నిధులు అందజేస్తున్నామన్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా కన్నుల పండువగా జరుగుతు న్నాయన్నారు. కళ్యాణోత్సవం సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

23న, పాతబస్తీలో కలశ స్థాపన, 25న సికింద్రాబాద్ అమ్మవారికి బోనాల సమర్పణ..

ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు జరుగనుంది. శాలిబండలోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది. అనంతరం ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగు తుంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.