ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా కష్ట కాలంలో రెండోసారి రంజాన్ మాసం…

నగరంలో అప్పుడే మొదలైన రంజాన్ మార్కేట్ సందడి...

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): ముస్లిం ప్రజలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెల 13న సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే..14వ తేదీ ఉదయం నుంచి రంజాన్ మాసం మొదటి రోజు ప్రారంభమవు

తుందని ముస్లిం మత పెద్దలు చెతున్నారు. అంటే మంగళవారం నెల వంక కనిపిస్తే..బుధవారం సహార్ తో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ముస్లింలు రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు. ఉపవాసం సంర్బంగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఉపవాస దీక్షల అనంతరం ప్రతి రోజు సాయంత్రం ఉపవాసం వదులుతారు. ఫళ్లు,ఫలాలు,హలీం,బిర్యానీ..ఇలా తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను భుజిస్తారు.  ఉపవాస దీక్షలను ప్రతి రోజు ఉదయం సహార్ తో ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్ విందుతో ముగిస్తారు. రోజుకు ఐదు సార్లు నమాజులు చేస్తూ నిష్టగా ఉంటారు.

కరోనా కష్ట కాలంలో రెండోసారి…

బుధవారం నుంచి  ప్రారంభమవుతున్నందున దేశ వ్యాప్తంగా ముస్లింలు అవసరమైన అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతేడాది రంజాన్ మాసం కరోనా వైరస్ కారణంగా నిబంధనల నడుమ ముగిసింది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం రంజాన్ మాసంలో ముస్లింలు తగిన ముందు జాగ్రత్తలు పాటించాలంటూ సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసారు. మసీదుల్లో కాకుండా తమ తమ ఇళ్లల్లోనే నమాజులు చేయాలంటూ సూచించారు. దీంతో చాలా మంది ముస్లింలు పలు అసౌకర్యాలకు గురయ్యారు. గతేడాది రంజాన్లో మసీదులను తాత్కాలికంగా మూసి వేసారు. నమాజులను ఇంటికే పరిమితం చేసారు. చారిత్రాత్మకమైన మక్కా మసీదులో సైతం సామూహిక ప్రార్దనలకుు అనుమతించ లేదు.

గతేడాది లాగా లేని నిబంధనలు…సంతెోషం వ్యక్తం చేస్తున్న ముస్లింలు

గతేడాది లాగే ఈసారి కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న సమయంలోనే మళ్లీ రంజాన్ మాసం వచ్చింది. అయితే ఈసారి నిబంధనలు అంతగా లేవు. మక్కా మసీదుతో పాటు స్థానిక మసీదుల్లో రోజు ఐదు సార్లు నమాజు చేసుకోవడంతో పాటు తరావీలు సైతం చేసుకోనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ..మాస్కులు ధరించి..శానిటైజర్లను వినియోగించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ముస్లింలు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. గతేడాది కన్నా ఈసారి కరోనా వైరస్ భయం ఉన్నప్పటికీ..ఘనంగానే  పండుగను నిర్వహించుకోవడానికి ముస్లింలు సిద్దమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కష్ట కాలంలో ముస్లింలు రెండో సారి రంజాన్ మాసాన్నినిర్వహించనున్నారు.

 

నగరంలో అప్పుడే మొదలైన రంజాన్ మార్కేట్ సందడి…

రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలు నిత్యావర వస్తువులను ఖరీదు చేస్తున్నారు. దీంతో మార్కెట్లన్నీ వినియోగదారులతో రద్దీగా మారాయి. ఎక్కడా భౌతిక దూరం పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. కొంత మంది మాస్క్ లు ధరిస్తున్నప్పటికీ..వాటిని నోరు,ముక్కు కవరయ్యే విధంగా సక్రమంగా పెట్టుకోవడం లేదు. దీంతో మాస్క లు ధరించినప్పటికీ ప్రయోజనం అంతగా ఉండదని వైద్యులు అంటున్నారు. రద్దీ గల మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళనకు గురవుతున్న కొంత మంది పండుగకు అవసరమైన అన్ని నిత్యావరస వస్తువులను సమకూర్చుకుం టున్నారు. నెల రోజులకు సరిపడ వస్తువులను స్టోర్ చేసుకుంటున్నారు. ఇక పేదలకు ఉచితంగా జకాత్ పేరుతో అందజేసే  కిట్ల ప్యాకింగ్ ఏర్పాట్లలో కొన్ని స్వచ్చంద సంస్థలు నిమగ్నమయ్యాయి.