ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి..

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి..
 • అనంత చతుర్దశి రోజైన ఈనెల 19న గణేష్ నిమజ్జనోత్సవం..
 • ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సంబంధిత అధికారులు..
 • పిఓపితో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి..
 • ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో తగిన ఏర్పాట్లు..
 • ఇప్పటికే నిమజ్జనోత్సవ శోభాయాత్రను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ అధికారుల బృందం..
 • పాత నగర శివారు బాలాపూర్ నుంచి గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రారంభం..

 

 ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 18 ( హైదరాబాద్): గ్రేటర్లో ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగర శివారు ప్రాంతమైన బాలాపూర్ నుంచి బయలుదేరే గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగర పోలీసులు తగిన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బయలు దేరే గణేష్ నిమజ్జనోత్సవ యాత్రను పురస్కరించుకొని శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితర అధికారుల బృందం ట్రైల్ రన్ నిర్వహించింది. శోభాయాత్ర రూట్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. శోభాయాత్ర సందర్భంగా దారిపొడవునా వినాయక విగ్రహాలకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన ఏర్పాట్లను పరిశీలించి.. విగ్రహాలకు రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్ల కొమ్మలతో పాటు విద్యుత్ వైర్లు అడ్డం రాకుండా ఉండేందుకు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గణేశ్ ఉత్సవాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో గత పది రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలకు భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు కొనసాగ నున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్ళించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ బస్సులను అనుమతించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆదివారం జరగనున్న నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షలపై 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని.. పోలీస్ అధికారులు తెలిపారు. గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.

గణేష్ నిమజ్జన శోభా యాత్ర…

 • బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మమార్గ్కు వినాయక విగ్రహాల తరలింపు కొనసాగుతుంది.
 • బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
 • సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగుతోంది.
 • ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
 • దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా శూబాయత్ర ముందుకు కొనసాగుతుంది.
 • టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు ఊరేగింపు కొనసాగుతుంది.
 • మేహది పట్నం, తపచ్ బుత్రా అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.
 • ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని పోలీసు సూచిస్తున్నారు.
 • ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది.
 • ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా నిఘాను ముమ్మరం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయనున్నారు.
 • విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఉంటుంది.
 • బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్దం చేసిన ట్రాఫిక్ పోలీసులు.