areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నిజాం మ్యూజియం ఖుల్ గయా…

నిజాం మ్యూజియం ఖుల్ గయా…

 

 • సందర్శకులకు అందుబాటులోకి నిజాం మ్యూజియం
 • రెండు నెలల మూసివేత అనంతరం సందర్శనకు ఓకే
 • ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి
 • ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాడిన పరికరాలతో పాటు బహుమతుల ప్రదర్శన
 • ఆకట్టుకుంటున్న బంగారు,వెండి వస్తవులు
 • నిజాం బంగారు సింహాసనం హైలైట్

ఆర్సీ న్యూస్,జూన్ 17 (హైదారాబాద్): నగరంలోని హెచ్ఈహెచ్ నిజాం మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండు నెలల నుంచి మూసి వేసిన నిజాం మ్యూజియంను ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి రీ-ఓపెన్ చేశారు. రెండు నెలల తర్వాత నిజాం మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను పాటిస్తూ సందర్శకులను లోనికి అనుమతిస్తున్నారు. నో మాస్క్..నో ఎంట్రీ..అనే బోర్డులు ఏర్పాటు చేసి గుంపులు,గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించేటట్లు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఏడవ నిజాం బహుమతులు,వాడిన వస్తువులతో మ్యూజియం…

 • నిజాం వంశ పాలకుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాతికేళ్ల పరిపాలన సందర్బంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో దేశ విదేశాలను చెందిన పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని విలువైన ఎన్నో బహుమతులను అందజేశారు. 
 • వారిచ్చిన బహుమతులన్నీ ఒకే చోట చేర్చి నిజాం మ్యూజియంగా మార్చారు.
 •  పురానీహవెలీలోని హెచ్ఈహెచ్ నిజాం మ్యూజియంగా నామకరణం చేసి అప్పట్లో నిజాం వాడిన వస్తువులతో పాటు అప్పట్లో నగరంలో నిర్మించిన పలు భవనాల కట్టడాల సందర్బంగా వినియోగించిన బంగారు గంపలు, తాపీలను నిజాం మ్యూజియంలో పొందుపర్చారు.
 •  అప్పట్లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భవన నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా బంగారం,వెండితో తయారు చేయించిన గంపలు,తాపీలను మాత్రమే వినియోగించే వారు. ఎందుకంటే అప్పట్లో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 
 • ఏది చేసినా ఘనంగా చేసేవారు. తరతరాలుగా గుర్తించుకునే విధంగా ఆయన కార్యక్రమాలుండేవి. 
 • 1937లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్..తన 25వ పరిపాలనను విజయవంతంగా పూర్తి చేశారు. 
 • 1911లో రాజ్యాధికారం చేపట్టిన ఆయన తన పాతికేళ్ల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసినందున పెద్ద ఎత్తున విజయోెత్సవ సభలను నిర్వహించారు.
 •  పలు దేశాలకు చెందిన పలువురు బంగారు,వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను బహుమతులుగా అందజేశారు. 
ఏడవ నిజాం బహుమతులు,వాడిన వస్తువులతో మ్యూజియం…
ఏడవ నిజాం బహుమతులు,వాడిన వస్తువులతో మ్యూజియం…

 చార్మినార్,గోల్కొండ కట్టడాలతో పాటు సాలార్జంగ్ మ్యూజియంల సందర్శనకు…

 •  ఇక చార్మినార్,గోల్కొండ కట్టడాలతో పాటు సాలార్జంగ్ మ్యూజియంలను ఈ నెల 19వ తేదీ అనంతరం తెరువనున్నారు.
 •  ఎందుకంటే రాష్ట్రంలో అప్పటి వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నందున వీటిని మూసి ఉంచుతున్నారు. 
 • ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలోకి వస్తాయి.
 •  ఏఎస్ఐ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని అన్ని పురాతన కట్టడాలు, మ్యూజియంలను మూసి వేశారు. 
 • ఇందులో భాగంగా నగరంలోని చార్మినార్,గొల్కొండ కట్టడాలతో పాటు సాలార్జంగ్ మ్యూజియంలను మూసి వేశారు. 
 • ఈ నెల 15వ తేదీ వరకు విధించిన ఆంక్షలు ముగిసిపోవడంతో 16వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఏఎస్ఐ ఉత్తర్వులు జారీ చేసింది.
 •  అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతుండడంతో వీటి సందర్శనకు మరో రెండు రోజులు ఆగక తప్పదని సంబందిత అధికారులు చెబుతున్నారు.
 •  ఇక నిజాం మ్యూజియం ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతుండడంతో ఈ నెల 16వ తేదీ నంచి సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు.