areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రంజాన్ సందడి..కనిపించని కరోనా కట్టడి జాగ్రత్తలు.

రంజాన్ సందడి..కనిపించని కరోనా కట్టడి జాగ్రత్తలు.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రంజాన్ మార్కెట్ లలో కరోనా కట్టడి జాగ్రత్తలు కనిపించడం లేదు. ప్రజలు యధేచ్చగా గుంపులు,గుంపులుగా షాపింగ్ చేస్తున్నారు. రంజాన్ మాసం చివరి రోజులకు చేరుకుంది. దీంతో నగరంలో ఎక్కడ చూసినా రంజాన్ సందడి కనిపిస్తోంది. రంజాన్ మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. జోరుగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. పండుగకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు ఇతర గ్రహోపకర వస్తువులను ఖరీదు చేయడంలో ప్రజలు నిమగ్నమయ్యారు. దీంతో ఎక్కడ చూసినా రంజాన్ సందడే..సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా పాతబస్తీలో రంజాన్ మార్కెట్ జోరుగా కొనసాగుతోంది. ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగకు ఇక వారం రోజులు మాత్రమే ఉండడంతో పాతబస్తీ చార్మినార్ పరిసరాలలోని రంజాన్ మార్కెట్ లన్నీ వినియోగదారులతో రద్దీగా మారాయి.

  • మదీనా సమీపంలోని పటేల్ మార్కేట్,రికాబ్ గంజ్, మదీనా మార్కెట్,ఉర్డూ గల్లీ,చార్ కమాన్ తదితర ప్రాంతాలలోని వస్త్ర వ్యాపారాలన్నీ జోరుగా కొనసాగుతున్నాయి.
  •  ఇక చార్మినార్ కట్టడం సమీపంలోని చార్ కమాన్,గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, చార్మినార్ – లాడ్ బజార్,మీరాలంమండి రోడ్లలలోని రంజాన్ మార్కెట్లన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.
  • రంజాన్ మాసం సందర్బంగా పలు వ్యాపారస్తులు తమ దుకాణాలను కళ్లు మిరమిట్లు గొలిపే విధంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు.
  • వినయోగదారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించి రంజాన్ మార్కెట్ నిర్వహిస్తున్నారు.
  • రోజంతా కఠోరమైన ఉపవాస దీక్షలు నిర్వహించిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొనడం..అనంతరం రంజాన్ షాపింగ్ చేయడంతో పాతబస్తీలోని వ్యాపార సముదాయాలన్నీవినియోగదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి.
 • రంజాన్ మార్కెట్లలో ప్రజలు అధిక సంఖ్యలో మాస్క్ లు ధరించడం లేదు. 
  • ఒకవైళ కొందరు మాస్క్ లు ధరించినప్పటికీ..వాటిని ముక్కు,నోరు కవర్ చేసే విధంగా వాడడం లేదు.
 • అంతేకాకుండా ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. 
 • దీంతో ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో..ఎవరికి లేదో..తెలియని అయోమయ పరిస్థితులు రంజాన్ మార్కెట్ లలో నెలకొన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నకరోనా వైరస్…

 • జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
 • ముఖ్యంగా పాతబస్తీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
 •  కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ..కేసుల పెరుగుదల తగ్గడం లేదు.
 • అయితే గత నెలలో ఒక రోజు పదిహేను వందల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా..ప్రస్తుతం వెయ్యి లోపుగానే కేసులు నమోదవుతున్నాయి.
 • బుధవారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో 6025 కేసులు నమోదు కాగా..52 మంది మరణించారు.
 • ఇందులో జీహెఎంసీ పరిధిలో 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 • కరోనా వైరస్ టెస్ట్ లను తక్కువగా చేస్తున్నందుకే..పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని..రోజుకు లక్ష వరకు కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది.
 • కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో మాదిరిగానే..సెకండ్ వేవ్ లో కూడా పాతబస్తీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
 •  నగరంలోని చార్మినార్ పరిసరాలలో రంజాన్ మార్కెట్ సందడి కొనసాగుతోంది.
 • ప్రస్తుతం రాత్రిపూట కరోనా కర్ఫ్యూ కొనసాగుతుండడంతో..రాత్రి 8 గంటల లోపే షాపింగ్ కొనసాగుతోంది.