ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వర్షా కాలం.. పొంచి ఉన్న వ్యాధులు..

వర్షా కాలం.. పొంచి ఉన్న వ్యాధులు..
 • అసలే కరోనా వైరస్ భయం..
 • దీనికి తోడు అంటువ్యాధులు..
 • అంటు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు…

ఆర్సీ న్యూస్, ఆగస్టు 26 (హైదరాబాద్): వర్షా కాలంలో చెత్త కుప్పలు, కలుషిత నీరు, దోమల వృద్ధి తదితర సమస్యలతో అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు అసలే కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనలు కలిగిస్తుండగా.. మరోవైపు పొంచి ఉన్న అంటువ్యాధులు కలవరం కలిగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే రోగాలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ సీజన్లో కలరా, డెంగ్యూ, టైఫాయిడ్, విరోచనాలు వంటి వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 • వాతావరణం చల్లబడడంతో అనేక కొత్త కొత్త వైరస్ ప్రభావం చూపుతాయి.
 • స్వైన్ ఫ్లూ వ్యాధి ఈ సీజన్ లోనే సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 • వైరస్ల కారణంగా దగ్గు, జ్వరంతో పాటు ఆ స్వస్థతలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 • ప్రధానంగా షుగర్,బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఈ సీజన్లో పలు ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు.
 • విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధి, ఎస్ టైఫే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్, రోటా వైరస్ తో డయేరియా, ఈడిస్ ఈజిప్ట్ దోమ తో డెంగ్యూ, ఇన్ఫ్లూయెంజా వైరస్లతో వివిధ రకాలైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఉపశమనం పొందే మార్గాలు…

 • సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి వేడినీటితో ఆవిరి పట్టడంతో పాటు పారాసెటమాల్ టాబ్లెట్ వాడవచ్చు 
 • విక్స్ వేపోరబ్  వంటి వాటిని వేడి నీటిలో వేసి ఆవిరి పట్టవచ్చు.
 • మూడు నాలుగు రోజుల నుంచి ఉపశమనం పొందలేకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
 • విరేచనాలు వాంతులతో బాధపడేవారు వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి.
 • ఓ ఆర్ ఎస్ ద్రావణంతో గ్లూకోజ్ లు వంటివి తీసుకోవాలి.
 • డయాబెటిస్, బీపీ ఉన్న వాటిని అదుపులో ఉంచేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 ముందు జాగ్రత్తలు…

 • తాగునీరు శుభ్రంగా ఉండాలి..
 • బయట అమ్మే వివిధ తినుబండారాలు,మసాలా వంటి పదార్థాలు తీసుకోవద్దు.
 • వేడిగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
 • చలి గాలిలో ఎక్కువగా తిరగవద్దు.
 • చెవులకు రుమాలును ధరించాలి.
 • అవసరమనుకుంటే చిన్న పిల్లలకు గాలి తగలకుండా ఒంటిని పూర్తిగా కప్పేసే విధంగా దుస్తులు వేయాలి.
 • దోమకాటు నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి దోమ తెరలు ఉపయోగించాలి.
 • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
 • ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో అవసరం. 
 • వర్షా కాలంలో ఎక్కువగా ఆకు కూరలు తినకుండా పప్పులు వాడితే మంచిదని వైద్యులు చెబుతున్నారు.