ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): సెకండ్ డే..లాక్ డౌన్ సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ లోని వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. ఉదయం నాలుగు గంటలు తప్పా..20 గంటలు జన జీవనం స్థంబించింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి. జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. అత్యవసర సేవలను అందజేసే వారు తప్పా..ఇతరులు ఎవరూ రోడ్లపై కనిపించ లేదు. గురువారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా లాక్ డౌన్ కొనసాగింది. గురువారం రెండో రోజు లాక్ డౌన్ కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు ఫ్రైండ్లీగా వ్యవహరించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.ఎం.భగవత్ తదితరుల పర్యవేక్షనలో గురువారం లాక్ డౌన్ బందోబస్తు కొనసాగింది. రెండో రోజు రాష్ట్రంలో కొనసాగిన లాక్ డౌన్ అమలు తీరును వారు స్వయంగా పరిశీలించారు.
ప్రధాన రోడ్లలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి అటువైపు నుంచి రాకపోకలు సాగించిన వాహనదారులను స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. లాక్ డౌన్ అమలు లోకి వచ్చిన తర్వాత కూడా రాకపోకలు సాగించడం ఏమిటని అక్కడక్కడ బందోబస్తులోని పోలీసులు వాహనదారులను ప్రశ్నించారు. ఎక్కడా లాఠీలకు పని చెప్ప లేదు. ఈ-పాస్ లతో పాటు అత్యవసర సేవలను అందజేస్తున్న వారిని అవసరమైన పత్రాలను చూపించాలని కోరారు. రెండో రోజు లాక్ డౌన్ కావడంతో వాహనదారులకు పోలీసులు ఇంకా అవగాహన కల్పిస్తున్నారు.
సెకండ్ డే..లాక్ డౌన్ సడలింపులో…
గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు దొరకడంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఖరీదు చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 10 రోజుల పాటు కొనసాగే లాక్ డౌన్ గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ నెల 22వ తేదీ వరకు రోజుకు ఇరవై గంటల పాటు లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలపై ఈ నెల 11న, ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ విధింపు,కరోనా కట్టడి తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ పది రోజుల పాటు లాక్ డౌన్ విధింపుకు ఓకే చెప్పడంతో 12వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు తప్పనిసరి అయ్యింది. దీంతో బుధవారం నుంచి ఇరవై గంటల పాటు లాక్ డౌన్ అమలు లోకి వచ్చి మొదటి రోజు పూర్తి అయ్యింది. అదే విధంగా రెండో రోజైన గురువారం కూడా ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపు ఉండడంతో ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన అన్ని లావాదేవీలను యథావిధిగా కొనసాగించారు. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు పని చేసాయి. రేషన్ దుకాణాలు రెండో రోజైన గురువారం కూడా 6 గంటలకే తెరవడంతో రేషన్ కార్డుదారులు సబ్సిడీ బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను ఖరీదు చేశారు. సంబందిత రేషన్ డీలర్లు కార్డుదారులకు అవసరమైన నిత్యావసర వస్తువులను 10 గంటల వరకు పంపిణీ చేశారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద కొద్దిగా రద్దీ తగ్గింది.
రంజాన్ పండుగ సందర్బంగా రంజాన్ మార్కెట్లో సందడే సందడి…..
ఈ నెల 14న, ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పండుగ ఉండడంతో గురువారం ఉదయం పది గంటల వరకు నగరంలో జోరుగా రంజాన్ మార్కెట్ కొనసాగింది. పండుగకు అవసరమైన షీర్ కుర్మా తయారీ కోసం వినియోగించే సేమియా, ఇతర డ్రై ఫ్రూట్స్ ఖరీదు చేశారు. పది గంటల నుంచి లాక్ డౌన్ అమలు లోకి వస్తుండడంతో…ప్రజలంతా తమకు అవసరమైన కూర గాయలు, నిత్యావసర వస్తువులను ఖరీదు చేయడానికి స్థానిక ప్రాంతాలలోని మార్కెట్ లను ఆశ్రయించారు. దీంతో ప్రధాన మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి. లాక్ డౌన్ కు ముందు వీధులన్నీ వినియోగదారులతో కళకళలాడాయి. రోడ్లన్నీ వాహనదారులతో కిక్కిరిపోయాయి. లాక్ డౌన్ విధింపుకు ముందు సడలింపు సమయంలో కరోనా కట్టడిని ప్రజలు మరిచిపోయారు. ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు బేఖాతరు చేశారు. 14వ తేదీన రంజాన్ పండుగ ఉండడంతో ముస్లింలు చార్మినార్ – మక్కా మసీదు రోడ్డు లోని రంజాన్ మార్కెట్ లను ఆశ్రయించడంతో అక్కడ గురువారం ఉదయం రద్దీ కనిపించింది.

More Stories
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..
దేశానికే ఆదర్శం.. డబుల్ బెడ్ రూమ్ పథకం..