మార్చి 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు గ్రేట్..

ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు గ్రేట్..
  • కరోనా వైరస్ వ్యాప్తి లో వైద్యులతో పాటు పోలీసుల సేవలు భేష్..
  • తమ ప్రాణాలను లెక్క చేయకుండా రోగులను కాపాడిన పోలీసులు..
  • కరోనా వైరస్ సోకి మృతి చెందిన పోలీసుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫార్మాస్యూటికల్ కంపెనీ కి ధన్యవాదాలు..
  • సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సంస్థల నిర్వాహకులు అభినందనీయులు..
  • కరోనా సమయంలో మృతి చెందిన ముగ్గురు పోలీసు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున చెక్కులు అందజేత..
  • మరణించిన పోలీసు కుటుంబాలకు నివాళులర్పించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్..

ఆర్సీ న్యూస్, నవంబర్ 18(హైదరాబాద్): ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తున్న సమయంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చి సేవలు అందజేశారని.. వారందరూ ఎంతో అభినందనీయులని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. తమ కుటుంబాలకు దూరంగా విధి నిర్వహణ కొనసాగిస్తున్న పోలీసు సిబ్బంది అభినందనీయులన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా తాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అంతేకాకుండా విధినిర్వహణలో కరోనా వైరస్ సోకి వైద్య సేవలు పొందుతూ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. కరోనా వైరస్ తో మృతి చెందిన పోలీసులకు ఆయన గురువారం నివాళు లర్పించారు. మరణించిన పోలీసు కుటుంబాలకు భారత దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా మ్యాన్ కైండ్ యాజమాన్యం మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, అదృశ్య శత్రువుపై పోరాటం చేసిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పోలీసు సిబ్బంది చేసిన సేవలను మరువలేమన్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాపారాలు, విద్యా సంస్థలను మూసి వేసి వారి ఇళ్లకే పరిమితం కాగా..వైరస్‌ను అరికట్టడానికి ప్రయత్నించిన కొంత మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులు  కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారన్నారు. కోవిడ్-19 లో మరణించిన పోలీసు యోధులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారంసమావేశం నిర్వహించి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. “ఈ మొత్తం లాక్డౌన్ కాలంలో మా పాత్ర అసాధారణమైనది.  మా విధుల్లో లేని పనులు చేశాం.  ఈ మొత్తం కాలంలో మనం ముందంజలో ఉన్నాం.  మేము కేవలం నాకా బందీ వంటి సాంప్రదాయ పనులను మాత్రమే చేయలేదు.. కంటైన్‌మెంట్ జోన్, భవనాలు, ఆసుపత్రులను కూడా కాపాడాము, అవసరమైన వస్తువుల సరఫరా క్రమబద్ధంగా ఉండేలా చూసుకున్నాము.  వలసదారులను స్వదేశానికి పంపే ప్రక్రియలో కూడా మేము నాయకత్వం వహించాము.  మేము దరఖాస్తులు తీసుకోవడం నుండి పాస్‌లు జారీ చేయడం, వలసదారులను రవాణా చేయడంలో సహాయం చేయడం వంటి మొత్తం ప్రక్రియను పూర్తి చేసాము…పోలీసు సిబ్బంది తమ సొంత ఆరోగ్యాన్ని, కుటుంబాలను, మరీ ముఖ్యంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి, నిస్వార్థ దృఢ సంకల్పంతో ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఈ సవాలు సమయంలో పోలీసులు నిజంగా మన హీరోలు.  మేము చేయగలిగేది వారి ప్రయత్నాలను అభినందించడం.. ఇంటి లోపల సురక్షితంగా ఉండడం ద్వారా సహకరించడం.. ఇప్పటివరకు, నార్త్ జోన్‌లో ముగ్గురు పోలీసు యోధులు కోవిడ్-19 కారణంగా మరణించారు. వీరందరికీ నివాళులు.. అని ఆయన వారి సేవలను కొనియాడారు.

మరణించిన పోలీసు కుటుంబ సభ్యులకు మేన్ కైండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శేతల్ అరోరా, సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్ శ్రీ రమేష్ కుమార్, కంపెనీ జోనల్ మేనేజర్, టీమ్ ఎ. సమీర్ కుమార్ తదితరుల బ్రందం ఆర్దిక సహాయం అందించారు.  మరణించిన ప్రతి కుటుంబానికి రూ: 3,00,000/- చెక్కులను అందించారు. ఆర్దిక సహాయం అందజేసిన వారికి అంజనీ కుమార్ అభినందనలు తెలిపారు.

మరణించిన పోలీసు కుటుంబ సభ్యులకు మేన్ కైండ్ ఫార్మాస్యూటికల్ ప్రతి కుటుంబానికి రూ: 3,00,000/- చెక్కులను అందించారు. ఆర్దిక సహాయం అందజేసిన వారికి అంజనీ కుమార్ అభినందనలు తెలిపారు.