ఏప్రిల్ 17, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సాలార్ జంగ్ మ్యూజియం ఆడియో గైడ్ యాప్ ప్రారంభం…

సాలార్ జంగ్ మ్యూజియం ఆడియో గైడ్ యాప్ ప్రారంభం...
  •  గ్యాలరీల సమాచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో గైడ్ యాప్..
  • యాప్ ను ప్రారంభించిన ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్..
  • గైడ్ లేకుండానే గ్యాలరీల సమాచారాన్ని ఆడియో ద్వారా తెలుసుకునే సదుపాయం..
  • ఈ ఆడియో గైడ్ సదుపాయాన్ని తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 18 (హైదరాబాద్): సాలార్ జంగ్ మ్యూజియం సందర్శకుల సౌకర్యార్థం కొత్తగా ఆడియో గైడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మ్యూజియం ను సందర్శించడానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం గైడ్ లేకుండానే తమ మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీ సమాచారాన్ని చరిత్రను, ప్రాధాన్యతను తెలుసుకోవడానికి వీలుపడుతుంది. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఈ ఆడియో యాప్ ను సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో ఐఏఎస్ అధికారి జయేష్ రంజాన్ లాంఛనంగా ప్రారంభించారు. సాలార్ జంగ్ మ్యూజియంలోని గ్యాలరీల కళాఖండాల విశిష్టత, చరిత్రలను సందర్శకులు ఆడియో గైడ్ యాప్ తో సులభంగా తిలకించవచ్చు అని ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం,   ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియం సెంట్రల్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ లో  మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి నిజాం కుటుంబ సభ్యులు, కేర్ టేకర్ రోనక్ లతో కలిసి  ఆయన సోమవారం గైడ్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆడియో యాప్ ద్వారా సందర్శకులు.. గైడ్ సలహా లేకుండానే మ్యూజియం సందర్శిస్తూ కళాఖండాల, చారిత్రక విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో..నిజాం సాంప్రదాయ వస్త్రధారణ, సూక్ష్మ చిత్రాల నుండి శిల్పాలు, తివాచీలు, బొమ్మలు, ఫర్నిచర్, గడియారాల వరకు గల 46,000 వస్తువుల సేకరణ చేసి ఏర్పాటు చేశారు.  ఈ సేకరణ ప్రముఖ సాలార్ జంగ్ కుటుంబం నుండి  తీసుకొని హాస్అన్ ఇండియా సంస్థ ద్వారా ఆధారితం చేయబడి ఉందన్నారు. మ్యూజియం కోసం ఆడియో గైడ్ యాప్తో, కళాకృతుల వెనుక కథలు, అద్భుతమైన ముఖ చిత్రాల వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టరే నాగేందర్ తెలిపారు.  సందర్శకులు పర్యటన సమయంలో మ్యూజియంలోని వారి స్వంత మొబైల్ ఫోన్లలో సులభంగా తెలుసుకోవచ్చని… గైడ్ లేకుండానే గ్యాలరీలలో తిరుగుతూ.. వాటిని తిలకిస్తూ వాటి విశిష్టతను వినవచ్చని అన్నారు. సందర్శకులు ప్రవేశానికి ముందే ఫోన్ సందర్శన టికెట్టు తీసుకొని సందర్శించాలని, హాల్ టికెట్ వెనుక భాగంలోని యాప్ ను ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మ్యూజియంలో 39 గ్యాలరీలనీ, 77 పాయింట్స్ యాప్ లో ఉంటాయన్నారు. ప్రతి గ్యాలరీ వద్ద స్కాన్ చేసి వాటి ప్రత్యేకతను ఆడియో ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

సందర్శకులు టికెట్ కౌంటర్లో మొబైల్ ఫోన్ టికెట్తో మొబైల్ యాప్ టిక్కెట్ను ఉచితంగా పొందవచ్చన్నారు.

వారు యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత, ఆడియో టూర్ ప్రారంభించడానికి వారు అందించిన కోడ్ ను నమోదు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం కీపర్ డాక్టర్ కుసుం, డిప్యూటీ కిపర్స్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఆడియో గైడ్ ప్రారంభోత్సవం అనంతరం సాలార్జంగ్ మ్యూజియం లోని ప్రధాన గ్యాలరీలను జయేష్ రంజన్ సందర్శించి తిలకించారు.