areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

KTR : ఆసియా లోనే అతి పెద్ద 2BHK హౌసింగ్ కాలనీ..

KTR : ఆసియా లోనే అతి పెద్ద 2BHK హౌసింగ్ కాలనీ..
  • కొల్లూరులో 112 బ్లాక్ లో 15,600 గృహాల నిర్మాణం..
  • దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ ఇల్లు..
  • నగరంలో రూ.9,714 కోట్లతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..
  • ఆత్మగౌరవంతో కూడిన గృహాల నిర్మాణం..
  • గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం..
  • ఖైరతాబాద్ ఇందిరా నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్ తో పాటు తలసాని, మహామూద్ అలీ

ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 03 (హైదరాబాద్): నగరంలో పేదల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలు దేశంలో మరెక్కడా లేవని..ఏ మహా నగరంలో పేదల ఆత్మ గౌరవంతో కూడిన గృహాలు లేవని.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఖైరతాబాద్ లోని ఇందిరా నగర్ కాలనీ లో రూ.17.85 కోట్ల వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూమ్ గృహాలను రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కమిషనర్ లోకేష్ కుమార్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ… దేశం లో చెన్నై, కలకత్తా, ముంబాయి, బెంగులూరు మహా నగరాలలో అక్కడి ఏ ప్రభుత్వాలు ఇలాంటి గృహాల నిర్మాణాలు చేపట్ట లేదన్నారు.

ఆసియా లోనే అతి పెద్ద 2BHK హౌసింగ్ కాలనీ..


ఇందిరా నగర్ లబ్దిదారులు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూశారు ఈ రోజు వారి కల నెరవేరింది అన్నారు.
భారత దేశంలో ఏ మహా నగరం లో ఎక్కడ లేని విధంగా ఆత్మ గౌరవంతో కూడిన గృహాలు నిర్మాణం చేసి పంపిణీ చెయ్యలేదన్నారు. గత ప్రభుత్వాలు ద6బ్బా ఇళ్లు ఇచ్చి ఏదో ఒక లింకు పెట్టి పేదలకు పంపిణీ చేసేవారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి చిక్కులు లేకుండా పేదలకు ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నామన్నారు. బ్రోకర్ లకు గాని ఎవ్వరికీ కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వవలసిన అవసరం లేదన్నారు.
నగరం లో రూ. 9714 కోట్ల వ్యయంతో పేదలకు 2 పడకల గదుల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరా నగర్ కాలనీ సిటీ సెంటర్లో ఉందని, ఇక్కడ చుట్టూ ప్రక్కల హుస్సేన్ సాగర్, నూతనంగా నిర్మించే 125 పీట్ల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్, అన్నింటికీ దగ్గర సిటీ సెంట్రల్ లో నిర్మాణం చేసిన నేపథ్యంలో ఇదే గృహాలు ప్రైవేటు వారు నిర్మిస్తే ఒక్కొక్క ప్లాట్ కు రూ. 50 నుండి రూ. 60 లక్షలకు పైగా రూపాయలకు అమ్మేవారని, పేదల మొహంలో చిరునవ్వు ఆత్మ గౌరవం తో బ్రతకాలని ముఖ్యమంత్రి ఆశయమాన్నారు. పెరుగుతున్న సంపాదనను సంక్షేమం అభివృద్ధి కార్యక్రమలు పేదలకు అందించాలనే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.ఇందిరా నగర్ లో నిర్మించిన గృహాల కు మౌలిక వసతులు కల్పించినట్టు లిఫ్ట్ తో పాటు త్రాగునీరు ఏర్పాటు చేసినట్లు, లబ్ది దారులు నిర్వహణ కోసం షాపులు కూడా ఏర్పాటు చేసినట్లు ఇట్టి షాపుల ద్వారా వచ్చే ఆదాయం కాలనీ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. లిఫ్ట్, పరిసరాల పరిశుభ్రత పచ్చదనం నిర్వహించాలని అందుకు యువకులు ముందుకు రావాలన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని కే.టి.ఆర్ అన్నారు. ఆసియాలోనే అతి పెద్ద హౌసింగ్ కాలనీ కొల్లూరులో 112 బ్లాక్ లో 15,600 గృహాలు నిర్మించిన నేపథ్యంలో త్వరలో సి.ఎం చే ప్రారంభించ నున్నట్లు . రాష్ట్రంలో మొత్తం 18 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి రాష్ట్రంలో 2 bhk గృహాలు చేపట్టినట్లు అందులో హైదరాబాద్ లో రూ. 9,714 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మోడరన్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందిరా నగర్ కాలనీ పక్కన హెచ్ఎండిఏ కు చెందిన ఎకరం స్థలం లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం అట్టి స్థలాన్ని జిహెచ్ఎంసి కి అందజేసిన తర్వాత జిహెచ్ఎంసి ద్వారా నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ ను కోరారు. మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మిగతా నియోజకవర్గం లో రూ. 3 నుండి రూ. 4 కోట్ల వ్యయం తో చేపడుతుండగా ఇక్కడ నిర్మించే ఫంక్షన్ హాల్ ఈ కాలనీ వాసులకే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని అన్నారు. రూ. 100 కోట్ల విలువైన స్థలాన్ని పేద ప్రజల కంటే గొప్ప విషయం కాదన్నారు.


రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదలు ఆత్మ గౌరవం తో బ్రతకాలని ఉద్దేశంతో భారత దేశంలో మరెక్కడా లేని విధంగా అద్భుతంగా పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ మంచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. అర్హులైన వారికి డ్రా ద్వారా ప్లాట్ కేటాయింపు జరుగుతున్నదని లబ్దిదారులు ఈ విషయం లో సహకరించాలన్నారు. ఖాళీ స్థలం లో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని ఇందిరా నగర్ కాలనీ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలన్నారు. నగర వాసులు శంషాబాద్, చంపాపేట్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ మాట్లాడుతూ పి.జే.ఆర్ నగర లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాన్ని 2 bhk నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా అందిస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా చెందాలనే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
జిహెచ్ఎంసి కమిషనర్ హౌసింగ్ అధికారులను అభినందించిన మంత్రి 2 bhk గృహ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న నేపథ్యంలో అందుబాటులోకి తెస్తున్న కమిషనర్, హౌసింగ్ అధికారులు, సిబ్బందికి మంత్రి కే టి ఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు గృహణలను పంపిణీ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన, కోమర్పిడిటిస్(co morbidities) ఉన్నవారి కోసం ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్ ను ఈ సందర్భంగా మంత్రి కే టి ఆర్ ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీమ్, బేవరేజ్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, స్పోర్ట్స్ అథారటి ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ప్రసన్న, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, సి.ఇ.సురేష్, ఎస్.ఇ.జి.కిషన్, ఇ.ఇ.వెంకటదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.