మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మహారాష్ట్రలో లాక్ డౌన్…

మహారాష్ట్రలో లాక్ డౌన్…

ఆర్సీ న్యూస్(హైదరాబాద్)..మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వీకెండ్లలో పర్యాటక ప్రాంతాలలో లాక్ డౌన్ ప్రకటించింది.

పార్కులు,బీచ్లు,పర్యాటక ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగుతుంది. వీకెండ్లలోని శని,ఆదివారాలలో ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ లాక్ డౌన్ విషయాలను పరిగణలోకి తీసుకుని తమ కార్యాచరణను రూపొందించుకోవాలని సంబందిత అధికారులు కోరుతున్నారు. అలాగే హోటల్స్,రెస్టారెంట్స్ టేక్ అవే ద్వారా పార్సిల్స్ తీసుకెళ్లాలని అంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సలలో కేవలం 50 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నారు. నిన్నఒక్క రోజే మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు  కాగా..ఒక్క ముంబాయిలోనే 9 వేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యుకు సిద్దమైంది. ఇందులో భాగంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందంటున్నారు. ఇక ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం..చేయాల్సిందేనని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది.