areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రమాణ

ఆర్సీ న్యూస్ (న్యూఢిల్లీ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ శనివారం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. 2022 ఆగస్ట్ 26 వరకు పదవిలో ఉండే ఎన్వీ రమణ సుప్రీంకోర్టు 48 ప్రధాన న్యాయమూర్తి. కాగా, ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పేరును, ఈ నెల 23న పదవీ విరమణ చేసిన సీజేఐ ఎస్ఏ బాబ్డే ప్రతిపాదించారు. ఎస్ఏ బాబ్డే ప్రతిపాదనను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 6వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిర్దారించారు. దీంతో బాబ్డే పదవి విరమణ చేసిన మరుసటి రోజైన శనివారం జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జస్టిస్ రమణ స్వగ్రామంలోని ప్రజలు బాణాసంచా పేల్చారు. సంబరాలు జరుపుకున్నారు. జస్టిస్ రమణ ప్రమాణస్వీకారొత్సవాలను తిలకించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొన్న వరం గ్రమంలో ఒకరోజు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసింది. దీంతో పొన్న వరం గ్రామస్తులు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనులారా తిలకించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా తమ గ్రామానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ భాద్యతలు చేపట్టడం గర్వహంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. 1983 ఫిబ్రవరి 10న, జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తన అడ్వొకేట్ వ్రుత్తిని ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..సీజేఐ పరిధిలోని సమాచార హక్కు చట్టం బెంచ్లో భాగస్వామి గాను కొనసాగారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టారు. 2013 మార్చి 10 నుంచి 2013 మే 20వ తేదీ వరకు..అంటే రెండు నెలల పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఆక్టింగ్ ఛీఫ్ జస్టిస్ గా కొనసాగారు. జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు..నూతలపాటి వెంకట రమణ. 1957 ఆగస్టు 27న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో వ్యవసాయదారుల కుంటుంబంలో జన్మించారు. 1982లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. 63 ఏళ్ల ఆయనకు నాయ విభాగంలో అపూర్వ అనుభవం ఉంది. ఎన్నో కీలకమైన, ప్రధాన్యత గల కేసులలో న్యాయ సమ్మతమైన తీర్పులను వెలువరించారు. శనివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమం నిరాఢంబరంగా జరిగింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న నేఫద్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్న కేంధ్ర ప్రభుత్వం ఫ్రోటోకాల్ ప్రకారం అతి తక్కువ మంది అధికారులు, కేంధ్ర న్యాయ శాఖ మంత్రితో జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. జస్టిస్ ఎన్వీ రమణ నియామకం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ తెలిపారు.