మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దేశ ద్రోహుల పార్టీ తో దోస్తానా: బండి సంజయ్..

దేశ ద్రోహుల పార్టీ తో దోస్తానా: బండి సంజయ్..
  • మూడో రోజు కొనసాగిన ప్రజా సంగ్రామ యాత్ర
  • బండ్లగూడ జాగీర్ లోని ఆరే మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన బహిరంగ సభ
  • 2023 లో..అధికారంలోకి బీజేపీ
  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం.
  • అధికారంలోకి రాగానే మజ్లీస్ పార్టీ వారిని పాకిస్థాన్ పంపిస్తాం: రాజా సింగ్

ఆర్సీ న్యూస్, ఆగస్టు 30 (హైదరాబాద్): తెలంగాణ సాధన కోసం పాటుపడని మజ్లీస్ పార్టీ తో దోస్తీ కట్టిన టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని బీజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడో రోజైన సోమవారం బండి సంజయ్ టిప్పు ఖాన్ బిడ్జ్ కు చేరుకొని ఆరే మైసమ్మ దేవాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ తో పాటు మజ్లీస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం దోస్తానా కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగిన ఉద్యమంలో మజ్లిస్ పార్టీ ఎక్కడా ఏ ఉద్యమంలో పాల్గొనలేదని.. అలాంటి పార్టీతో అధికారంలోకి వచ్చిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ దోస్త్ కొనసాగిస్తోందన్నారు. దేశద్రోహ పార్టీ తో దోస్తానా చేయడం సరైనదేనా… అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పురాతన కట్టడాలు, ఆస్తులన్నీ నిజాం సర్కార్ కు చెందినవని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని…తాము 2023 లో అధికారం చేపట్టిన వెంటనే ఈ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆస్తులన్నీ ఒకప్పుడు తెలుగు ప్రజలకు చెందినవేనన్నారు. దౌర్జన్యంగా సొంతం చేసుకున్న ఆస్తులన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2023 లో..రాబోయేది బిజెపి ప్రభుత్వమేనన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశద్రోహ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. పాతబస్తీకి రావాలంటే సీఎం కేసీఆర్ సైతం మజ్లిస్ పార్టీ అనుమతి తీసుకోవాలని విర్రవీగిన ఎంఐఎంకు తాము పాతబస్తీలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి బిజెపి పార్టీ దమ్ము ఏమిటో తెలియజేశామన్నారు. సీఎం కేసీఆర్ కు మజ్లీస్ పార్టీ ఇచ్చిన సవాల్ ను టిఆర్ఎస్ నాయకులు ఎవరు స్వీకరించ లేదని…తాము మాత్రం పెద్ద ఎత్తున సభను నిర్వహించి తమ బలమేమిటో మజ్లిస్ పార్టీ నాయకులకు తెలియజేశామని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ తమ జాగీర్ అని విర్రవీగిన మజ్లీస్ పార్టీకి బహిరంగ సభ ద్వారా తామే ఒక సవాల్ విసిరామన్నారు. పాతబస్తీయే కాదు.. బీజేపీ తలుచుకుంటే తెలంగాణ మొత్తం తమ అడ్డాగా మార్చుకుంటోందన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద తాము పూజలు నిర్వహించి ప్రజా సంకల్ప యాత్రకు నాంది పలికామన్నారు. పాతబస్తీలో నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా హిందువులకు చక్కటి సందేశాన్ని అందించిందన్నారు. తమ సభను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. భాగ్యలక్ష్మి పేరుతో భాగ్యనగరం ఏర్పడిందని… గోల్కొండ గొల్ల కొండ అనీ… గొల్ల కురుమల పేరుతో గోల్కొండ ఏర్పడిందని ఆయన అన్నారు. అవినీతి పాలన నుంచి రక్షించాలని కోరుతూ తెలంగాణ ఘోషిస్తోందని.. అందుకే తాము ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మజ్లీస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆందోళన, పోరాటాలు చేయలేదని..అలాంటి తెలంగాణ వ్యతిరేక పార్టీతో లోపాయికారి ఒప్పందం ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి 2023 లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. అంతకుముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ… రాబోయే రెండేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పి తెలంగాణను కాపాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నప్పటికీ.. తండ్రి కొడుకులు నాటకాలు ఆడుతున్నారన్నారు. దేశంలో అబద్దాల ముఖ్యమంత్రి పేరుతో సర్వే నిర్వహించి అవార్డులను అందజేస్తే… సీఎం కేసీఆర్ ముందువరుసలో ఉండి అవార్డులు పొందుతారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం రెండు వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తే.. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతానన్నారు. గోషామాల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని రాజా సింగ్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మజ్లీస్ పార్టీ వారిని పాకిస్తాన్ పంపిస్తామన్నారు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు మజ్లీస్ పార్టీ నాయకులు భయపడ్డారని..రెండోసారి మోడీ ప్రధానమంత్రి కాగానే జనగణమన పాడుతున్నారని.. మూడోసారి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం వారిని ఏం చేస్తుందో తెలుసన్నారు.