మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

KARNATAKA Bajrangdal activist murder కర్ణాటక హత్య కేసులో ముగ్గురి అరెస్టు..

KARNATAKA Bajrangdal activist murder కర్ణాటక హత్య కేసులో ముగ్గురి అరెస్టు..
  • మరో ఇద్దరి కోసం గాలింపు..
  • బజరంగ్ దళ్ ప్రతినిధి హర్ష హత్యతో టెన్షన్ గా మారిన కర్ణాటక..
  • హిజాబ్ ధరించడం పై హర్ష చేసిన పోస్టింగ్ లే హత్యకు కారణమంటున్న నాయకులు..
  • హర్ష హత్య కేసులో ఐదుగురు ప్రమేయం..
  • ముస్లిం గుండాలే హత్య చేశారన్న మంత్రి ఈశ్వరప్ప..
  • మంత్రి ఈశ్వరప్ప కు బుద్ధి లేదు అంటున్న కాంగ్రెస్ నాయకులు..
  • నిందితులను కఠినంగా శిక్షించాలి అంటున్న మాజీ సీఎం సిద్దరామయ్య.
  • హర్ష అంత్యక్రియల సందర్భంగా చెలరేగిన ఆందోళనలు..
  • కొన్ని వాహనాలు ధ్వంసం..
  • కర్ణాటకలో పరిస్థితి ఉద్రిక్తం..
  • త్వరలోనే శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయి అంటున్న కర్ణాటక హోం శాఖ మంత్రి జ్ఞానేంద్ర..

 ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 21 : కర్ణాటక రాష్ట్రంలో బజరంగ్దళ్ ప్రతినిధి హర్ష హత్య కేసులో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. ఈ హత్య కేసులో ఐదు మంది నిందితుల ప్రమేయం ఉందని.. ఇందులో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అక్కడి హోమ్ శాఖ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ..శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది. రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి శాంతిభద్రతలు నెలకొంటాయని చెబుతోంది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం పై అభ్యంతరాలు వెలువడ్డాయి. దీంతో ఒక వర్గం తాము తప్పనిసరిగా  హిజాబ్ ధరిస్తాం.. అంటూ మొండి కాయగా విద్యాసంస్థల్లో విద్యార్థులందరూ ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సూచించిన మేరకు యూనిఫామ్ ధరించాలి తప్పా..  హిజాబులు ధరించరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కర్ణాటకలో హిజాబ్ పై ఆందోళనలు మొదలయ్యాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా దీనిపై రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువైంది. దీంతో ఇరు వర్గాల ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడక్కడా నిరసనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో హత్యకు గురైన హర్ష హిజాబ్ ధరించడం పై ఫేస్ బుక్ లో కామెంట్లను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టులు వైరల్ కావడంతో కొంతమంది అతనిపై ఆగ్రహం పెంచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్ష హత్య కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. మీరు చేశారంటే,  మీరు చేశారంటూ ఒకరినొకరు మీడియా ముందుకు వచ్చి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల ప్రజల్లో అయోమయం నెలకొంది.

KARNATAKA Bajrangdal activist : హర్ష హత్య కేసులో నిజాలను కర్ణాటక పోలీసులు చేర్చాల్సి ఉన్నప్పటికీ..

రాజకీయ నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది గుండాలతో ఈ హత్య చేయించినట్లు అధికార పార్టీ మంత్రి ఈశ్వరప్ప చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. మంత్రి ఈశ్వరప్పకు మతి భ్రమించిందన్నారు. హర్ష హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదలద్దన్నారు. కాగా ఇప్పటికే హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అక్కడి హోం శాఖ మంత్రి  జ్ఞానేంద్ర తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కర్ణాటకలో శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయి అన్నారు.  ఒకట్రెండు చోట్ల నే పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాంతిభద్రత లకు ఎక్కడ విఘాతం కలగడం లేదన్నారు. ప్రజలు శాంతియుతంగా తమ దైనందిన జీవితంలో నిమగ్నమయ్యారన్నారు. ఇదిలా ఉండగా సోమవారం హర్ష అంత్యక్రియల సందర్భంగా అక్కడ అక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంత్యక్రియల దారిలో కొన్ని వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చారు.