areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నవంబర్ 16 నుంచి జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్..

నవంబర్ 16 నుంచి జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్..
  •  ఇందులో భాగంగా క్రీడా శాఖ మంత్రి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ..
  • వచ్చే నెల 16 నుంచి 20 వరకు జాతీయ స్థాయిలో పోటీలు..
  • తగిన ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 26 (హైదరాబాద్): రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో నవంబర్ 16 నుండి 20 వరకు జరగనున్న జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ – 2021 బ్రోచర్ ను మూసి రివర్ డవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్ మాట్లా డుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నా మన్నారు. అందులో భాగంగా జాతీయ పవర్ లిప్టింగ్ చాంపియన్ షిఫ్ కు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నా మన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలోని  ఇండోర్ స్టేడియంలో నవంబర్ 16 నుండి 20 వరకు జాతీయ పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ ను పెడరేషన్ నిర్వహిస్తున్నా మన్నారు. ఈ చాంపియన్ షిప్ ను తెలంగాణ పవర్ లిప్టింగ్ పెడరేషన్ అధ్వర్యంలో తెలంగాణ క్రీడా శాఖ సహాకారంతో ఈ జాతీయ స్థాయి పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ జరుగుతుంద న్నారు. ఈ చాంపియన్ షిప్ లో 26 రాష్ట్రాలు పాల్గోనబోతున్నాయన్నారు.

కరోనా పరిస్థితుల తర్వాత జాతీయ స్థాయిలో ఈ చాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయ న్నారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మంటన్, టెన్నిస్, కబడ్డీ, రెస్లింగ్, బాడీ బిల్డింగ్, పుట్ బాల్ లాంటి అనేక క్రీడాంశాలలో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం ను, నగదు పుర స్కారాలను ఘననీయంగా పెంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాము. క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం , ఉన్నత విధ్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నామన్నారు.

సిఎం కెసిఆర్ గారి అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపోందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్ధ బోతున్నామన్నారు. పవర్ లిప్టింగ్ లో మన తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రాజశ్రీ, శ్రీనాధ్, సాయి లలీత్, రాజశేఖర్ లాంటి క్రీడాకారులను తెలంగాణ క్రీడా శాఖ ద్వారా ఎంతో ప్రోత్సాహన్ని అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పెడరేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , నిర్వాహకులు రంగేశ్వరి శ్రీనివాస్. యు. శ్రీనివాస్, శ్రీనాద్ తదితరులు పాల్గోన్నారు.