ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రా..రండోయ్..యాదగిరిగుట్టకు..

రా..రండోయ్..యాదగిరిగుట్ట ..
  • యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి పీఎం ను ఆహ్వానించిన సీఎం..
  • న్యూ ఢిల్లీ లో నరేంద్ర మోడీ ని కలిసి వినతిపత్రం అందజేసిన సీఎం..
  • యాబై నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశం..
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహాయం చేయాలని వినతి..
  • సానుకూలంగా స్పందించిన పీఎం..

ఆర్సీ న్యూస్, సెఫ్టెంబర్ 4 (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విశాలంగా,ఆధ్యాత్మికంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట దేవాలయ ప్రారంభోత్స వానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆహ్వానించారు. గత కొంతకాలంగా చారిత్రాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయాన్ని రాబోయే అక్టోబర్- నవంబర్ మాసాల్లో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ మధ్యన ముహూర్తాలను ఖరారు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానంగా పంపిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం సాయంత్రం న్యూ ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలిసిన రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ మేరకు ఆహ్వానించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పి ఎం మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దేశ ప్రధానిగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొంత కాలంగా పునర్నిర్మాణ పనులు జరుగుతూ పూర్తికావడంతో రాబోయే అక్టోబర్, నవంబర్ మాసంలో ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నరేంద్ర మోడీని కలిసి పలు విన్నపాలు చేశారు. ఇందులో హైదరాబాదులో ఐఐఎం ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ల సంఖ్య 139 నుంచి 195 కి పెంచాలని.. హైదరాబాద్-నాగపూర్, వరంగల్- హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయాలని.. కరీంనగర్లో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని.. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని.. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికారిక భవనం కోసం స్థలం కేటాయించాలని.. వరంగల్ టెక్ట్స్ టైల్ పార్కు అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇవ్వాలని.. కొత్తగా 21 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని.. గ్రామీణ సడక్  యోజన పథకం కింద అదనపు నిధులు ఇవ్వాలని.. సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం కేసీఆర్, దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విన్నవించారు. కెసిఆర్ వినతి మేరకు నరేంద్ర మోడీ స్పందించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. రహదారులు, పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాలపై ఢిల్లీలోని ప్రధాని నివాసంలో యాభై నిమిషాల పాటు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము కొనసాగిస్తున్న పలు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.