areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సాగర్లో టీఆర్ఎస్..తిరుపతిలో వైఎస్సార్ విజయం…

సాగర్లో టీఆర్ఎస్..తిరుపతిలో గురుమూర్తి విజయం...

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): అనుకున్నట్లుగానే..నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్..తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టి అభ్యర్థి విజయం సాధించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు తెలంగాణ లోని నాగార్జున సాగర్. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని తిరిగి తన ఖాతాలో వేసుకోవాలని ఎన్నికల బరిలోకి దిగగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికార వైఎస్సార్ సీపీ తన పార్లమెంట్ స్థానాన్ని తిరిగి సాధించడం కోసం ఎన్నికలలోకి దిగింది. రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా క్రుషి చేశాయి. నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగున్న నేపధ్యంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చనట్లు వార్తలు వెలువడ్డాయి. ఏదీఏమైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటర్లందరికి ఇటు టీఎస్ సీఎం కేసీఆర్ తోపాటు అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలు ధన్యవాదాలు తెలిపారు. 

జానారెడ్డిపై నోముల భగత్ భారీ విజయం..

అలాగే నోముల భగత్ కూడా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్  18,872 ఓట్లతో విజయం సాధించారు. నోముల భగత్ కు 89,804 ఓట్లు రాగా..కాంగ్రేస్ అభ్యర్థి జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పుకొ చ్చిన బీజేపీ అభ్యర్థికి 7,676 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రేస్ పార్టీ కైవసం చేసుకుంటుందని..జానారెడ్డి స్థానికుడు కావడమే కాకుండా సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర ఉందని..తమ పార్టీ విజయం ఖాయమని  కాంగ్రేస్ పార్టీ సినియర్ నాయకులు ఎన్నికల ప్రచారం సందర్బంగా చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి ఎన్నికల ఫలితాలు వెడ్డాయి. నోముల భగత్ విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఆయన మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల సందర్బంగా నోముల నర్సింహ్మయ్య కుటుంబం నుంచి మాత్రమే టికెట్ కేటాయించడానికి పార్టీ అధిష్టానం ముందుకు వచ్చింది. నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ కు పార్టీ అధిష్టానం తిరిగి టికెట్ కేటాయించింది. ఓ వైపు కరోేనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న కీలక సమయంలో నాగార్జున సాగర్ లో ఎన్నికల ప్రచారం జోరుగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులతో పాటు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని నోముల భగత్ కే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరుగా ప్రచారం నిర్వహించింది. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందారు.

ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: జానారెడ్డి

ఫలితాలు వెలువడగానే తాను ఇక నుంచి  ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటు న్నట్లు జానారెడ్డి ప్రకటించారు. సుదీర్ఘంగా రాజకీయాలలో పని చేశానని..వయో భారంతో పాటు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేఫథ్యంతో ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా ఉండడానికి నిశ్చయించకున్నానని..ఇది తన వ్యక్తిగత నిర్ఱయమని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం తన సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తే అవసరమైన మేరకు సలహాలు,సూచనలు ఇవ్వడానికి సిద్దంగా ఉంటానన్నారు. తన రాజకీయ వారుసుడిని సైతం పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. తనకు ఓట్లు వేసిన నాగార్జున సాగర్ నియోజక వర్గం ఓటర్లందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.