areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈటెల రాజేందర్ పై మరో భూ వివాదం..

ఈటెల రాజేందర్ పై మరో భూ వివాదం

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై సోమవారం మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. దేవర యంజాల్ లోని సీతారామస్వామి దేవాలయం భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు జమునా హ్యాచరీస్ కు సంబందించిన అసైన్డ్ భూముల కబ్జా కొనసాగుతుండగానే..రాష్ట్ర ప్రభుత్వం దేవర యంజాల్ దేవాలయ భూముల ఆక్రమణపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు టీం లీడర్ గా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో దేవర యంజాల్ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 1521 ఎకరాల దేవాలయ భూమి కబ్జా జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూములు ఎవరి వద్ద ఉన్నాయి..? ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలు ఉన్నాయా..? అవి ఏమిటి..? అనే సమాచారంతో పాటు ప్రస్తుతం అందులో నుంచి ఈటెల రాజేందర్ కానీ,ఆయన అనుచరులు కానీ.. ఎన్ని ఎకరాలు కబ్జా చేసారు..అనే వివరాలను సేకరించడానికి ఈ 4 గురు ఐఏఎస్ అధికారుల కమిటీ బృందం తేల్చనుంది. దాదాపు 30 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాలయలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని భావిస్తున్నారు. ఒకవైపు సోమవారం ఉదయం 11 గంటలకు ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో ఉండగానే..మరోవైపు దేవరయంజాల్ లోని సీతారామస్వామి భూముల ఆక్రమణ అంశం తెరపైకి వచ్చింద. ఈ విషయంపై ఈటెల రాజేందర్ మాట్టాడుతూ..దేవరయంజాల్ భూ వివాదం ఎప్పటి నుంచో ఉందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వేసిన కమిటి ఎటూ తేల్చ లేదన్నారు. తనపై అక్కసుతో అక్కడున్న రైతులకు అన్యాయం చేయోద్దన్నారు. ఏదైనా పారదర్శకంగా ఉండాలన్నారు. దేవరయంజాల్ రైతులకు న్యాయం చేయాలన్నారు. తాను ఎక్కడా భూములను కబ్జా చేయలేదన్నారు. గత నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఈటెల ఎపిసోడ్ రాను రాను కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి విచారణలను వేగంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకవైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండగా..  రాజకీయ సమీకరణాలు కూడా అంతే వేగంగా కొనసాగుతున్నాయి. 

ఏప్రిల్ 30 నుంచి కొనసాగుతున్న ఈటెల ఎపిసోడ్..నేడు నాలుగవ రోజు

 • గత నెల 30వ తేదీన మొదలైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదం రాజకీయ దుమారంగా మారి రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.

 ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఏప్రిల్ 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించారు. 

 • ఈటెల రాజేందర్ భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
 •  సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ,పోలీసు అధికారుల బ్రుందాలు రంగంలోకి దిగి మే 1న (శనివారం) ఉదయం నుంచే వివాదస్పదంగా మారిన అచ్చంపేట్ భూములపై విచారణ ప్రారంభించారు.
 • విచారణలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని…మెదక్ జిల్లా కలెక్టర్ తో పాటు భూ కబ్జా జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమికంగా నిర్ధేశించి తమ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందజేయడంతో.. వెంటనే స్పందించిన సీఎం మే 1( శనివారం )న, ఈటెల రాజేందర్ వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. 
 •  ఆ వెంటనే విచారణకు సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందడం..అందులో భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధారణ కావడంతో మే 2( ఆదివారం)న, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం, గవర్నర్ కు సిఫారస్ చేయడం.. గవర్నర్ వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయాయి. 
 • వీటన్నింటిపై సోమవారం(మే 3న) ఉదయం ఈటెల రాజేందర్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా..దేవర యంజాల్ సీతారామస్వామి దేవాలయ భూముల ఆక్రమణ అంశం వెలుగు చూసింది. 
 • దీంతో ఈటెల భూ కబ్జాల వ్యవహరం ఎపిసోడ్ నాలుగవ రోజుకు చేరింది.
 •  మొదటి రోజైన ఏప్రిల్ 30న..అచ్చంపేటలోని జమున హ్యాచరీస్ అసైన్డ్ ల్యాండ్ భూ వివాదంపై మీడియాలో హల్ చల్..
 • ఏప్రిల్ 1న, వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఆయనను తొలగించడం..
 • ఏప్రిల్ 2న, ఆ వెంటనే మళ్లీ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.
 • ఇక ఏప్రిల్ 3న, కొత్తగా వెలుగు చూసిన దేవరయంజాల్ దేవాలయం భూమి ఆక్రమణలు..ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.